Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కేన్స్ లో F3 చూపిస్తోందా?

By:  Tupaki Desk   |   18 May 2022 3:06 AM GMT
ఫోటో స్టోరి: కేన్స్ లో F3 చూపిస్తోందా?
X
కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్స్ హంగామా షురూ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ న‌టీమ‌ణులు కేన్స్ న‌గ‌రానికి ప్ర‌యాణ‌మ‌వుతూ విమానాశ్ర‌యాల్లో కెమెరా కంటికి చిక్కారు. ఇందులో ఐశ్వ‌ర్యారాయ్ - పూజా హెగ్డే త‌దిత‌రులు ఉన్నారు. ఇక సౌత్ నుంచి మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కూడా కేన్స్ లో సంద‌డి చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది.

తమన్నా ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌టిగా లీగ్ లో చేరింది. తమన్నా తాజా రెడ్ కార్పెట్ లుక్ వైర‌ల్ గా మారింది. మిల్కీ నైసుగా గౌరీ నైనికా గౌనులో బబుల్ హెమ్ లుక్ తో ఆక‌ట్టుకుంది. ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ తో తెల్లటి ట్రయిల్ తో బాడీ హ‌గ్గింగ్ స్టైల్లో క‌నిపిస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ లుక్ లో త‌మ్మూ చాలా అందంగా కనిపిస్తోంది. ఇంకా ఈ వేదిక‌పై మెరుపులు తురుములు మునుముందు బ‌య‌ట‌ప‌డ‌నున్నాయి.

F3 తో తెలుగు ఆడియెన్ ని కిల్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న మిల్కీ వైట్ బ్యూటీ ఇప్పుడు కేన్స్ లో కూడా ఎఫ్ 3 చూపిస్తోందంటూ ఈ ఫోటోల‌కు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సోష‌ల్ మీడియాల్లో కేన్స్ పేరుతో ఎఫ్ 3కి ప్ర‌మోష‌న్స్ సాగిపోతున్నాయి. మిల్కీ మొదటిసారిగా కేన్స్ ఆహ్వానితుల జాబితాలో ఉండ‌డంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. త‌న లైఫ్ లో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అరుదైన స‌న్నివేశ‌మిది. ఇక నయనతార కూడా సౌత్ నుంచి ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాయిన్ అవుతుంద‌న్న టాక్ ఉంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ అయితే లేదు.

ప్ర‌పంచం చూపు మిల్కీ- పూజాపైనే!

ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్స్ 2022లో ఈసారి బాలీవుడ్ నుంచి ఎవ‌రెవ‌రు అటెండ‌వుతున్నారు? అన్న‌దానికి క్లారిటీ వ‌చ్చింది. కేన్స్ 2022లో బాలీవుడ్ ప్రముఖుల్లో ఎప్ప‌టిలానే ఐశ్వర్య రాయ్ బచ్చన్- ఏ.ఆర్.రెహ‌మాన్ ఇప్ప‌టికే ఖాయ‌మ‌య్యారు. అభిషేక్ బచ్చన్ -కుమార్తె ఆరాధ్య బచ్చన్ ల‌తో క‌లిసి ఐష్ రెండు రోజుల క్రితం కేన్స్ 2022కి వెళ్లేందుకు విమానాశ్రయంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కేన్స్ 2022కి వెళ్లే విమానాశ్రయంలో ఉన్నారు. వారి ఎయిర్ పోర్ట్ లుక్ లు ఇప్ప‌టికే లీక‌య్యాయి.

కేన్స్ 2022లో ఈసారి సంద‌డి చేస్తున్న సౌత్ స్టార్ ఎవ‌రు? అంటే.. రాధే శ్యామ్ బ్యూటీ.. మ‌న బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే.... త‌మ‌న్నా.. ఖ‌రార‌య్యారు.. 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పూజా- త‌మ‌న్నా ఇద్ద‌రూ తొలిసారి అరంగేట్రం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలిసారిగా కనిపించ‌నున్న‌ సౌత్ బ్యూటీస్ కి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా విమానాశ్రయంలో సంద‌డి క‌నిపించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ స‌హా కేన్స్ 2022కి వెళ్లేందుకు విమానాశ్రయంలో క్లిక్ అయిన ఫోటోల్లో పూజా హెగ్డే ఫోటోలు యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి.

కేన్స్ అంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న అరుదైన వేడుక‌. ఇలాంటి చోటికి వెళ్లే రేర్ ఛాన్స్ పూజా.. త‌మ‌న్నాల‌ను వ‌రించింది. ప్రియాంక చోప‌రా త‌ర‌హాలోనే ఈ ఇద్ద‌రూ త‌దుప‌రి హాలీవుడ్ ప్ర‌య‌త్నాలు ఏవైనా చేస్తారా? అవ‌కాశాలు వ‌రిస్తాయా? అన్న‌ది చూడాలి.