Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స్టార్ డాట‌ర్స్ తో మాయలోడు?

By:  Tupaki Desk   |   3 Jan 2023 5:30 AM GMT
ఫోటో స్టోరి: స్టార్ డాట‌ర్స్ తో మాయలోడు?
X
ఇటీవ‌ల ఏ పార్టీకి వెళ్లినా అత‌డే సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్. అత‌డు కేవ‌లం స్టార్ డాట‌ర్స్ తో మాత్ర‌మే పార్టీల్లో క‌నిపిస్తున్నాడు. చుక్క‌ల్లో చంద్రుడిలా వెలిగిపోతూ ఇత‌రులు కుళ్లుకునేలా చేస్తున్నాడు. ఇంత‌కీ అత‌డు ఎవ‌రు? డెబ్యూ నాయిక‌ల‌కు మెంటారా? అంటే కానే కాదు. అత‌డు జ‌స్ట్ ఫ్రెండ్ మాత్ర‌మే. కానీ అత‌డికి అప్ క‌మింగ్ క‌థానాయిక‌ల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అత‌డి సాన్నిహిత్యంలో ఈ ప్ర‌పంచాన్నే మైమ‌రిచి కాక్ టైల్ పార్టీల‌ను ఒక రేంజులో ఆస్వాధిస్తున్నారు. రేతిరంతా జాగారంలో ఫుల్ గా చిలౌట్ చేస్తున్నారు. ఇంత‌గా మైమ‌రిపింపజేస్తున్న ఈ మాయ‌లోడు ఇంత‌కీ ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

చాలా కాలంగా బాలీవుడ్ న‌ట‌వారసురాళ్ల‌తో పార్టీల్లో చెల‌రేగుతూ రొమాంటిక్ విన్యాసాల‌తో నెటిజ‌నుల క‌ళ్ల‌ను త‌న‌వైపు తిప్పేసుకుంటున్న ఈ కుర్రాడు ఒర్రీ అలియాస్ అవ్ర‌త‌మ‌ణి. సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో కుర్ర డీన్ లా అత‌డు మెరుపులు మెరిపించే వైనం చాలా క‌న్ఫ్యూజ‌న్ కి గురి చేస్తోంది. ఒర్రీ కేవ‌లం స్నేహితుడు మాత్ర‌మేనా? స‌ద‌రు భామ‌ల‌కు ర‌క్ష‌కుడా? అంటే దీనికి స‌రైన స‌మాచారం లేదు. ప్ర‌స్తుతానికి అత‌డు జ‌స్ట్ ఫ్రెండ్ మాత్ర‌మే.

ఒర్రీ ఇటీవ‌ల ఎక్కువ‌గా అజయ్ దేవగన్- కాజోల్ కుమార్తె నైసా దేవగన్ తో ఎక్కువ‌గా పార్టీల్లో త‌ల‌మున‌క‌లుగా క‌నిపిస్తున్నాడు. నైసా ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టక‌పోయినా ఇప్పుడు అత‌డితో షికార్ల వ‌ల్ల బోలెడంత ఫేమ‌స్ అయిపోతోంది.

నైట్ పార్టీల్లో మ‌తి చెడ‌గొట్టే రూపంతో క‌నిపిస్తోంది. నైసాలో గ్లామ‌ర్ డోసు మ‌రీ అంత‌కంత‌కు పెరిగిపోతోంద‌ని తాజాగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల నుంచి విడుద‌లైన ఫోటోలే చెబుతున్నాయి. నైసా దేవగన్ ఓర్హాన్ అవత్రామణి సహా తన స్నేహితులతో కలిసి తన కొత్త సంవత్సరం వేడుక‌ల‌ను దుబాయ్ లో ఆస్వాధించింద‌ని ఇంత‌కుముందే తుపాకి వెల్ల‌డించింది.

ఓర్హాన్ తాజాగా మ‌రికొన్ని స్పైసీ ఫోటోల‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. నైసా దేవగన్ అత‌డితో ఎంతో స‌న్నిహితంగా క‌నిపిస్తోంది. ఒర్రీని త‌న అంగ ర‌క్ష‌కుడి(సెక్యూరిటీ)గా భావిస్తోంద‌ని ఈ ఫోటోలు చెబుతున్నాయి. ఎంత‌యినా క్లాస్ మేట్ కం బెంచ్ మేట్ అయితేనే క‌దా ఇంత‌టి సాన్నిహిత్యం అన్న సందేహాల్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు నైసా గ్లామ‌ర్ విందు చూశాక‌.. అభిమానులు నైసుగుంద‌మ్మా ఈ య‌వ్వారం! అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అన‌న్య‌-సుహానా- ఖుషీ- జాన్వీ-సారా- మహికా రాంపాల్ స‌హా ప‌లువురు బాలీవుడ్ నాయిక‌లు అత‌డితో ఎక్కువ‌గా పార్టీల్లో క‌నిపిస్తున్నారు. ఒక‌వేళ పార్టీలో అత‌డు మిస్స‌యితే ఐ మిస్ యు ఒర్రీ.. ల‌వ్ యు! అంటూ టీజ్ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా స‌ద‌రు భామ‌ల‌కు ఉన్న సోష‌ల్ మీడియా అనుచ‌రుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.