Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : నివేదా నేచురల్ లుక్స్.. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..!

By:  Tupaki Desk   |   29 Dec 2022 1:30 AM GMT
ఫోటో స్టోరీ : నివేదా నేచురల్ లుక్స్.. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..!
X
కోలీవుడ్ అందాల భామ నివేదా పేతురాజ్ సినిమాలతో ఎంత సందడి చేస్తున్నా తన నో మేకప్ లుక్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సాధారణంగా హీరోయిన్స్ వారి రియల్ ఫేస్ అదే నండి నో మేకప్ లుక్ ని చూపించడానికి ఇష్టపడరు. కానీ నివేదా మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. తను షూటింగ్ టైం లోనే మేకప్ తో కనిపిస్తుంది మామూలు టైం లో మాత్రం నో మేకప్ అంటుంది. అంతేనా తన మేకప్ లెస్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి హంగామా చేస్తుంది. హీరోయిన్స్ ని ఎలాగైనా ఇష్టపడే వారి ఫ్యాన్స్ ఈ మేకప్ లెస్ ఫోటోస్ కూడా లైకులు కొట్టేస్తుంటారు.

ఈ క్రమంలోనే నివేదా పేతురాజ్ ఈ మేకప్ లెస్ పిక్స్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. లేటెస్ట్ గా అమ్మడు వైట్ అండ్ వైట్ నైట్ వేర్ లో క్యాజువల్ లుక్ తో ఫోటో షూట్ చేసింది. అలా సరదాగా దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు ఉంది.

ఇలా షేర్ చేసిందో లేదో అలా ఆమె ఫ్యాన్స్ వాటిని వైరల్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో సూపర్ టాలెంట్ ఉన్న హీరోయిన్ గా నివేదా తనకు తగిన ఛాన్స్ లు అందుకుంటుంది. తన దాకా వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేస్తూ మెప్పిస్తున్న నివేదా పేతురాజ్ ప్రస్తుతం తెలుగులోనే దూసుకెళ్తుంది.

ఆల్రెడీ కోలీవుడ్ లో తన టాలెంట్ చూపించిన అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. సినిమాతోనే కాదు తన ఫోటో షూట్స్ తో కూడా తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర అవుతుంది నివేదా పేతురాజ్. విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న ధంకీ సినిమాలో నటిస్తున్న నివేదా ఆ తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమని ఎగ్జైట్ అవుతున్న నివేదా పేతురాజ్ ఇక్కడ వరుస ఛాన్స్ లు వస్తే చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని కూడా అనుకుంటుంది.

తన నేచురల్ యాక్టింగ్ తో ఇచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ వస్తున్న నివేదా ఈమధ్య గ్లామర్ సైడ్ కూడా చూపించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. కెరీర్ లో ఫస్ట్ టైం ధంకీ సినిమాలో స్కిన్ షో చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ కూడా గ్లామర్ షో చేయడం మొదలు పెడితే మాత్రం అవకాశాలు వరుసగా వస్తాయని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.