Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: న‌వ దంప‌తుల న‌యా ఫోజులు!

By:  Tupaki Desk   |   18 March 2022 8:35 AM GMT
ఫోటోస్టోరీ: న‌వ దంప‌తుల న‌యా ఫోజులు!
X
విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ ఇటీవ‌లే ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రేమ వ్య‌వ‌హారం మీడియాకి లీక్ కాకుండా..నెట్టింట పెద్ద‌గా హ‌డావుడి లేకుండా సింపుల్ గా మ్యారేజ్ చేసుకుని దంప‌తులుగా ఒక‌ట‌య్యారు. మీడియా విష‌యంలో ఈ జంట చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని స‌క్సెస్ అయిందిగా చెప్పొచ్చు. ర‌క‌ర‌కాల గాసిప్పుల‌కు తావు ఇవ్వ‌కుండా ఎంత వేగంగా ప్రేమ‌లో ప‌డ్డారరో అంతే వేంగా వివాహం చేసుకోవ‌డంతోనే మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు. రాజాస్థాన్ లో జ‌రిగిన వివాహం సైతం నిరాడంబంరంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఆ పెళ్లి తంతుని బిజినెస్ ప‌రంగా స‌ద్వినియోగం చేసుకున్నారు. దాదాపు 100 కోట్ల‌కు పెళ్లి పుటేజీని ఓ ఓటీటీ సంస్థ‌కు అమ్మేసారు. ఆ ర‌కంగా జంట మీడియాలో హైలైట్ అయ్యారు. ఇక పెళ్లి త‌ర్వాత కెరీర్ ని జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికి వారు సోలోగా ఫోటో సెష‌న్లో పాల్గొన్న విక్కీ-క్యాట్ లు ఇప్పుడు దంప‌తులుగా కెమెరాకి ఫోజులిస్తున్నారు. ఫేమ‌స్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై హైలైట్ అయ్యేందుకు ఇద్ద‌రు జంట‌గా ఇప్ప‌టికే ప‌లు ఫోటో సెష‌న్స్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రోసారి విక్కీ-క్యాట్ లు జంట‌గా ఫోజులిచ్చారు. ఇందులో విక్కీ కౌశ‌లో న‌లుపు ష‌ర్ట్...ప్యాట్ ధ‌రించి పైన పూల డిజైన్ తో కూడిన కోట్ ధ‌రించారు. ఇక క‌త్రినా డార్క్ బ్లూ ఔట్ ఫిట్ లుక్ లో ఆక‌ట్టుకుంది. ఈ జంట‌ని ఇలా చూసి అభిమానులు మురిసిపోతున్నారు. బ్యూటీఫుల్ క‌పుల్..బోత్ ఆర్ లుకింగ్ సో హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక విక్కీ-క‌త్రినా సినిమాల‌ విష‌యానికి వ‌స్తే ఇద్ద‌రు బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క‌త్రినా బాలీవుడ్ లో ఎప్ప‌టి నుంచో అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నారు. ప్ర‌స్త‌తుం 'ఫోన్ బూట్'..'మేరీ క్రిస్మ‌స్'..'టైగ‌ర్-3' చిత్రాల్లో న‌టిస్తున్నారు 'ఉరి' సినిమాతో విక్కీ కౌశ‌ల్ కెరీర్ ఒక్క‌సారిగా ట‌ర్న్ తీసుకుంది.

అప్ప‌టికే కొన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ 'ఉరి' ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవలే 'స‌ర్దార్ ఉద్ద‌మ్' తో మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం 'గోవింద్ నామ్ మేరా'.. 'ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ' చిత్రాల్లో న‌టిస్తున్నాడు.