Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మసాలా లేదు.. బ్లాక్ అండ్ వైట్

By:  Tupaki Desk   |   19 March 2020 8:30 AM GMT
ఫోటో స్టోరీ: మసాలా లేదు.. బ్లాక్ అండ్ వైట్
X
'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముంబై భామ నేహ శర్మకు టాలీవుడ్ లో పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో ఎంచక్కా ముంబై ఫ్లైట్ ఎక్కి మిషన్ బాలీవుడ్ మొదలు పెట్టింది. అక్కడ కూడా వెంటనే ఆఫర్లు దక్కలేదు. దీంతో మిషన్ ఇన్స్టాగ్రామ్ మొదలు పెట్టి నెటిజన్లలో వేడి పెంచడం మొదలుపెట్టింది. దీంతో సూపర్ పాపులారిటీ దక్కింది. దాంతో పాటు నెమ్మదిగా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఒక నిముషం సమయం దొరికితే చాలు.. నేహ ఏదో ఒక ఫోటో తీసుకుని ఆ ఫోటోను లటుక్కున ఇన్స్టాలో అప్లోడ్ చేసి ఏదో ఒక క్యాప్షన్ ఇస్తుంది. ఈరోజు మరోసారి నేహ అదేపని చేసింది. ఒక ఫోటో పోస్ట్ చేసి "#త్రో బ్యాక్ థర్స్ డే. ఎందుకంటే నా ఫోన్ లో ఉన్న పాతవన్నీ వెతికి వెలికితీసేంత సమయం ఉంది"అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయింది కదా. కరోనా దెబ్బకు పాపకు చాలా టైమ్ దొరికింది. తీరిగ్గా కూర్చుని ఓపిగ్గా తన చలాకీ చరవాణి లో ఉన్న క్రీస్తు పూర్వపు ఛాయాచిత్రాలను శోధించి వాటిని అంతర్జాలికులకు బహుమతిగా పంచింది. ఫోటో విషయానికి వస్తే ఓ స్లీవ్ లెస్ వైట్ షర్టు ధరించి నడుముపై చేతులు పెట్టుకుని పోజిచ్చింది. మేకప్ లేకుండా.. తలపై ఓ టోపీతో ఓ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.

నేహకు 10 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు కదా. దీంతో ఇలా ఫోటో పోస్ట్ చెయ్యడం ఆలస్యం. ఏదో ఒక కామెంట్ పెడతారు. "ఏక్ నంబర్".. "డల్ గా కనిపిస్తున్నావు".. "జబర్దస్త్ " అంటూ కొందరు స్పందించారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'తైష్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది. పుల్కిత్ సామ్రాట్.. హర్షవర్ధన్ రాణే.. జిమ్ సర్బ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.