Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పొర విప్పి బుస‌లు కొడుతున్న నాగిని

By:  Tupaki Desk   |   20 Feb 2021 1:30 PM GMT
ఫోటో స్టోరి: పొర విప్పి బుస‌లు కొడుతున్న నాగిని
X
టీవీ న‌టి మౌని రాయ్ కెరీర్ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోంది. నాగిన్ సీరియ‌ల్ తో దేశ‌వ్యాప్తంగా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న‌ ఈ భామ కెరీర్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అనూహ్య‌మైన‌ మలుపులు తీసుకుంటోంది. ప‌రిశ్ర‌మ‌లో హాటెస్ట్ ఫిట్టెస్ట్ బాడీతో హీట్ పెంచుతున్న మౌని.. బాలీవుడ్ లో గోల్డ్ అనే చిత్రంతో అడుగుపెట్టింది. అక్షయ్ కుమార్ సరసన ఆరంభ‌మే అవ‌కాశం అందుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ త‌ర్వాత కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో ఐటెమ్ నంబ‌ర్ లో మెరుపులు మెరిపించి సౌత్ కి పరిచ‌యం అయిపోయింది.

ఇటీవ‌ల మౌని ఇన్ స్టా వేదిక‌గా అన్ లిమిటెడ్ ట్రీట్ తో హీటెక్కిస్తోంది. ఈ వేదిక‌పై భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇన్ స్టాలో హాటెస్ట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ యువ‌త‌రంలోకి దూసుకుపోతోంది. మౌని వ‌రుస‌గా బికినీలు స్విమ్ సూట్లతో చెల‌రేగుతోంది. ఇంత‌కుముందు దుబాయ్ ‌లోని ఓ బికినీ బీచ్ నుంచి లేటెస్ట్ లుక్ ని షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. దీంతో పాటే లేటెస్టుగా పింక్ టూపీస్ లో మౌని తాజా ఫోటోషూట్ యూత్ లో హాట్ టాపిక్ అవుతోంది. మౌని కిల్ల‌ర్ లుక్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఇటీవ‌లే ఐ హేట్ లవ్ స్టోరీస్ లోని బహారా పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలాన్ని జెట్ స్పీడ్ తో షేక్ చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రాలో అమితాబ్ బచ్చన్- రణబీర్ కపూర్ - అలియా భట్ లతో కలిసి కనిపించ‌నుంది. చివరిసారిగా ZEE 5 లో `లండన్ కాన్ఫిడెన్షియల్‌` సిరీస్ లోనూ క‌నిపించింది. పురబ్ కోహ్లీ - కులరాజ్ రంధవా ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. త్వ‌ర‌లోనే మౌనీ సూరజ్ నంబియార్ అనే బిజినెస్ మేన్ కం బ్యాంక‌ర్ ని పెళ్లాడ‌నుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.