Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బీచ్ లో స్కూల్ పాప‌లా ఎంజాయ్ చేస్తున్న న‌భా

By:  Tupaki Desk   |   11 April 2021 11:30 AM GMT
ఫోటో స్టోరి: బీచ్ లో స్కూల్ పాప‌లా ఎంజాయ్ చేస్తున్న న‌భా
X
ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రవాత క‌న్న‌డ బ్యూటీ న‌భా న‌టేష్‌ కెరీర్ జెట్ స్పీడ్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో ఇలియానా త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి ఎన‌ర్జిటిక్ పెర్ఫామ‌ర్ గా ఈ అమ్మ‌డు పాపుల‌రైంది. ఒక సెక్ష‌న్ అభిమానులు జూనియ‌ర్ ఇలియానా అంటూ న‌భాని ఆకాశానికెత్తేస్తున్నారు.

సోష‌ల్ మీడియాల్లోనూ న‌భా న‌టేష్ కి అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఈ వేదిక‌పై నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతున్న న‌భా లేటెస్ట్ గా బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఎంతో సింపుల్ గా వైట్ డిజైన‌ర్ ఫ్రాకులో న‌భా సోయ‌గాలకు ఫిదా అయిపోయిన అభిమానులు.. అచ్చం స్కూల్ పాప‌నే త‌ల‌పిస్తోంది! అంటూ కామెంట్ చేస్తున్నారు.

నభా త‌దుప‌రి అంధాధున్ తెలుగు రీమేక్ ‌లో రాధికా ఆప్టే పాత్రలో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌న కెరీర్ లో తొలి రీమేక్ అని తెలిపిన న‌భా.. రీమేక్ మూవీలో త‌న‌కు ఆఫ‌ర్ చేసిన పాత్ర‌లో న‌టించ‌డం ఛాలెంజింగ్ అని కూడా అంది. ఒక‌టికి రెండు సార్లు చూశాకే ఈ పాత్ర‌కు అంగీక‌రించాన‌ని.. ఒక మంచి చిత్రంలో న‌టిస్తున్నందుకు ఆనందంగా ఉందిన వెల్ల‌డించింది. రీమేక్ లో న‌టించేప్పుడు మాతృక నుంచి ఆడియెన్ రిఫ‌రెన్స్ తీసుకుంటారు. అందుకే తాజా ఆఫ‌ర్ ని ఛాలెంజింగ్ గా భావిస్తున్నాన‌ని వెల్ల‌డించారు.