Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ లుక్ తో గుబులు రేపుతున్న మాళ‌విక‌

By:  Tupaki Desk   |   12 March 2020 7:29 AM GMT
కిల్ల‌ర్ లుక్ తో గుబులు రేపుతున్న మాళ‌విక‌
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `పేట‌` చిత్రంలో సాదా సీదా గృహిణిగా క‌నిపించిన మాళ‌వికా మోహ‌న‌న్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. ఈ అమ్మ‌డు ఇన్ స్టాలో చెల‌రేగుతుంది. నిరంత‌రం త‌న‌దైన‌ గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో మెస్మ‌రైజ్ చేస్తుంటుంది.

తాజాగా మాళ‌విక లేటెస్ట్ ఫోటోషూట్ ఒక‌టి ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ స్టిల్ ప్రస్తుతం యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. మాళ‌విక కిల్లింగ్ లుక్ తో యూత్ గుండెల్లో షివ‌రింగ్ పుట్టిస్తోంది. వైట్ టాప్ .. దానికి కాంబినేష‌న్ డిజైన‌ర్ థై స్లిట్ బాట‌మ్ తో దుమారం రేపుతోంది. ఇక మాళ‌విక కాన్ఫిడెన్స్ ఆ క‌ళ్ల‌లో అద్భుతంగా ఎలివేట్ అయ్యింది.

ఇక మాళ‌విక కెరీర్ ని ప‌రిశీలిస్తే .. కేవ‌లం ఐదారేళ్ల‌లోనే స్పీడ్ పెంచేసింది. ఈ అమ్మ‌డు వ‌రుస‌గా టాప్ హీరోల సినిమాల్లో న‌టించేస్తోంది. తాజాగా ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న 64వ చిత్రం `మాస్ట‌ర్‌`లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ద్విభాషా చిత్రానికి ఎంపికైన సంగ‌తి తెలిసిందే. `కాక ముట్టై` ఫేమ్ ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌కత్వంలో మొద‌లైనా మిడిల్ డ్రాప్ అయ్యార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇక యాక్ష‌న్ డ్రామా మాస్ట‌ర్ లో మాళ‌విక అందాల విందు ఓ రేంజులో ఉంటుంద‌ని తెలుస్తోంది. తెలుగు హీరోల స‌ర‌స‌న ఈ అమ్మ‌డి పేరు వినిపిస్తోంది. అయితే ఇక్క‌డ ఇంకా స‌రైన ఆఫ‌ర్ ప‌డాల్సి ఉంది.