Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఈఫిల్‌ వద్ద అభయ్ రామ్‌ తో ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   21 Nov 2021 2:30 PM GMT
పిక్ టాక్‌ : ఈఫిల్‌ వద్ద అభయ్ రామ్‌ తో ఎన్టీఆర్‌
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నిన్నే హైదరాబాద్ నుండి విదేశీ యాత్రకు బయలుజేరి వెళ్లిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ మొత్తం ఎయిర్‌ పోర్ట్ లో కనిపించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు మాస్క్ లు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిన విజువల్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎన్టీఆర్‌ తన కొడుకులతో ఉన్న ఏ ఫొటో అయినా భారీగా వైరల్‌ అవ్వడం ఖాయం. ఎన్టీఆర్‌ తన కొడుకులతో ఉన్న ఫొటోలు చాలా క్యూట్‌ గా ఉంటాయన్న కామెంట్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ మరో ఫొటోను షేర్ చేశాడు.

ప్రాన్స్ లోని పారిస్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి చేస్తోంది. తనయుడు అభయ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఈఫిల్ టవర్ వద్ద ఇలా ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ట్విట్టర్ మరియు ఇన్ స్టాలో ఈ ఫొటోను షేర్‌ చేశాడు. ఎన్టీఆర్ మరియు ఆయన తనయుడి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇద్దరు కలిసి చాలా ఫొటోలు ఉన్నాయి కాని ఈఫిల్ టవర్ వద్ద వీరిద్దరి పొటో చాలా స్పెషల్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుండగానే అభయ్ రామ్‌ పెద్దవాడు అవుతున్నాడని ముందు ముందు హీరోగా దూసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. జక్కన్న దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదలకు ముందు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ఎన్టీఆర్‌ మొదలు పెట్టాల్సి ఉంది. కాని అనూహ్యంగా చేయికి అయిన చిన్న గాయం కారణంగా విశ్రాంతి మోడ్‌ లో ఎన్టీఆర్‌ ఉన్నాడు. జనవరి వరకు ఎన్టీఆర్‌ కొరటాల శివ కాంబో మూవీ వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.