Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బీచ్ సెల‌బ్రేష‌న్ లో జాన్వీ

By:  Tupaki Desk   |   13 Dec 2020 9:09 AM IST
ఫోటో స్టోరి:  బీచ్ సెల‌బ్రేష‌న్ లో జాన్వీ
X
`గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ మూవీతో తొలిసారి జాన్వీ క‌పూర్ వార్త‌ల్లో నిలిచింది. ఈ మూవీ వివాదాస్ప‌దం అయిన విష‌యం తెలిసిందే. ఏయిర్ ఇండియా ఉద్యోగుల్ని కించ‌ప‌రిచేలా వుంద‌ని వివాదం చెల‌రేగింది. ఆ త‌రువాత మేక‌ర్స్ వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో వివాదం స‌మ‌సిపోయింది. దీంతో ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి చిత్రాల్లో న‌టిస్తూ జాన్వీ బిజీగా వుంది.

కొంత విరాం ల‌భించే స‌రికి రిలాక్స్ కోసం బీచ్ ‌లో ఒక రోజు గడిపింది. ఇది త‌న‌కు చాలా సరదాగా ఉందని పోస్ట్ చేసింది. త‌న ఆనందాన్ని ఆమె ఇన్ ‌స్టాగ్రామ్‌ లో ప‌లు ఫొటోల‌ని పోస్ట్ చేసి అభిమానుల‌తో పంచుకుంది. `బీచ్ సరదాగా ఉంటుంది` అని త‌న ఫొటోల‌కు క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. క‌ల‌ర్ ‌ఫుల్ షార్ట్‌.. టీష‌ర్ట్‌ లో చిరున‌వ్వులు చిందిస్తూ అహ్ల‌ద‌క‌ర‌మైన బీచ్ వాతావ‌ర‌ణాన్ని జాన్వీ ఎంజాయ్ చేస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

ప‌డిలేచే కెర‌టాల‌ని చూస్తూ చ‌ల్ల‌ని సాయంత్రాన్ని అంతులేని ఆనందంతో ఆస్వాదిస్తున్నజాన్వీ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం రాజ్ ‌కుమార్ రావు న‌టిస్తున్న `రూహిఅఫ్జా`, కార్తీక్ ఆర్య‌న్‌ తో `దోస్తానా 2`.. క‌ర‌ణ్ జోహార్ `తఖ్త్` చిత్రాల్లో జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది.