Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: జిల్లనిపించే జిమ్ము పోజు

By:  Tupaki Desk   |   18 Dec 2019 10:56 AM GMT
ఫోటో స్టోరీ: జిల్లనిపించే జిమ్ము పోజు
X
బాలీవుడ్ లో ఈతరం స్టార్ కిడ్స్ లో జాన్వి కపూర్ కు కాస్త క్రేజ్ ఎక్కువే. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడమే అందుకు కారణం. దానికి తగ్గట్టే జాన్వి తన ఫ్యాషన్ సెన్స్ తో ప్రేక్షకలను ఆకట్టుకుంటుంది. మరి నటన సంగతి?.. అని మీరు ప్రశ్నిస్తే.. ఇప్పటి దాక నటించింది ఒకే సినిమా కదా. నటిగా మారడానికి ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. అంతలోపు గ్లామర్ కు కొత్త గ్రామర్ నేర్పిస్తూ సోషల్ మీడియా తాట తీస్తోంది.

సందర్భానికి తగ్గట్టు డ్రెస్ ధరించి చూపరులను డంగైపోయేలా చెయ్యడంలో జాన్వి ఒక దిట్ట. అందరో జిమ్ముకు ఏదో ఒక స్పోర్ట్స్ డ్రెస్ ధరించి పరిగెడుతుంటారు. కానీ జాన్వి అలా కాదు. జిమ్ము డ్రెస్సుల వయ్యారానికి కేరాఫ్ అడ్రెస్. జాన్వి వ్యాయామశాల దుస్తుల వయ్యారం అనే అంశంపై ఆంగ్లంలో ఒక పెద్ద పుస్తకం రాస్తే హార్పర్ కాలిన్స్ వారో.. పెంగ్విన్ వారో పబ్లిష్ చెయ్యకమానరు. ఆ బుక్కును నెటిజన్లు పైసా డబ్బు ఖర్చు పెట్టకుండా ఫ్రీ డౌన్ లోడ్ చేసుకోకుండా ఉండరు. అంత గ్లామరస్ గా ఉంటాయి జాన్వి జిమ్ము డ్రెస్సులు. రీసెంట్ గా జాన్వి మరోసారి ఓ కత్తి ఇలాంటి జిమ్ డ్రెస్ తో చూపరులను కట్టిపడేసింది. జిప్ ఉండే బ్లాక్ కలర్ జాకెట్.. మెరుస్తూ ఉండే సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించి చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని చిరునవ్వులు రువ్వుతూ కనిపించింది.

డ్రెస్ సూపర్.. ఫేస్ లో నవ్వు సూపర్. ఈ ఫోటోలో అందాల విందులు లేనే లేవు. అయినా అందాల భామ ప్రతిసారి అందాలను వడించడమే పనిగా పెట్టుకుంటుందా? ఒక్కోసారి ఇలా అందమైన డ్రెస్సులో కనిపించి జనాలను మాయ చేస్తుంది. ఈ ఫోటోలకు లైకులు.. షేర్లతో నెటిజన్లు హోరెత్తించారు. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.