Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎర్త్ షేకింగ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   23 Oct 2019 6:14 AM GMT
ఫోటో స్టోరి: ఎర్త్ షేకింగ్ బ్యూటీ
X
`చీక‌టిగ‌దిలో చిల‌క్కొట్టుడు` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది నిక్కీ తంబోలి. వేడెక్కించే అందాల‌తో.. బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేకెత్తించింది ఈ భామ‌. లారెన్స్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలోనే తెర‌కెక్కిన `కాంచన 3`లోనూ క‌థానాయిక‌గా న‌టించింది. తెలుగు .. తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం బి - సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబట్టింది. కాంచ‌న 3 చిత్రం 100 కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో ప్ర‌వేశించిందని ప్ర‌క‌టించి షాకిచ్చింది టీమ్. అంత క్రేజీ చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం శ్రీ‌విష్ణు న‌టిస్తున్న‌ `తిప్ప‌ర మీసం` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో నిక్కీ కెరీర్ ఫుల్ జోష్ లో ఉంద‌ట‌. అక్క‌డ లేటెస్టుగా ఓ క్రేజీ ప్రాజెక్టుకు సంత‌కం చేసింది. అప్పుడే కెరీర్ లో అర‌డ‌జ‌ను సినిమాల‌కు చేరువ‌లో ఉన్న ఈ బ్యూటీని క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వ‌స్తున్నాయిట‌.

లేటెస్టుగా బాంద్రాలో ఇండిగో డెలికేట్ సెన్ రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ ఈవెంట్ ముఖ్య అతిధిగా నిక్కీ త‌ళుకుబెళుకులు హైలైట్ గా నిలిచాయి. బోల్డ్ బ్యూటీ అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డుచెప్ప‌ద‌ని తాజాగా మ‌రోసారి ప్రూవైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు యువ‌త‌రం వాట్సాప్ లు.. సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.