Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పసుపు డ్రెస్సు.. హాటు పాప

By:  Tupaki Desk   |   2 March 2020 10:30 PM GMT
ఫోటో స్టోరీ: పసుపు డ్రెస్సు.. హాటు పాప
X
కొందరు భామలను దేవుడు ఈ లోకంలో సామాజిక మాధ్యమ ప్రజల రాజ్యంలో మంటలు పెట్టమని చిప్ సెట్ చేసి మరీ పంపిస్తాడు. ఆ చిప్ కనుక పొరపాటున యాక్టివేట్ అయిందా.. ఇక జనాలు నెటిజన్లు చచ్చినట్టే. దిశా పటాని పాపకు ఈ చిప్ ఓ నాలుగైదేళ్ల క్రితం యాక్టివేట్ అయింది. ఆ ప్రభావం తో అందమైన బికినీలను.. అంతకంటే అందమైన లోకేషన్లను వెతుక్కుని మరీ వేసుకుంటుంది. వాటిని అంతర్జాలంలో అలా చేపలకు వల వేసినట్టుగా వేస్తుంది. దెబ్బకు నెటిజన్లు సఫా.

ఇలా ఎంతో మందిని తీయని వేదనకు.. కళాత్మక శోధనకు గురి చేస్తూనే 31 మిలియన్లకు పైగా ఫాలోయర్లను సాధించింది. వీరి కోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఫోటోతో తగుదునమ్మా అంటూ తయారుతుంది. దీంతో ఇన్స్టా పేరంటంలో హాటు ఫోటోల కోసం కాచుకుని కూర్చున్న మగ మారాజులకు తకధిమితోం తప్పదు. తాజాగా దిశ తన ఇన్స్టా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మేకప్ నేనే చేసుకున్నా" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో పసుపు రంగు గౌన్ ధరించి వయ్యారంగా ఓ పెద్ద అద్దం ముందు నిలుచుంది. ఆ ఒంపులు నయాగరా నుంచి తీసుకొచ్చి ఎవరో దిశాలోపల ప్రవేశ పెట్టారేమో అనిపించకమానదు. స్వయంగా మేకప్ చేసుకున్నప్పటికీ చాలా అందంగా ఉంది. హెయిర్ స్టైల్ కూడా అదిరి పోయింది.

ఈ ఫోటోకు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఓ లైక్ వేసుకున్నాడు. టైగర్ ష్రాఫ్ హాటు సిస్టర్ కృష్ణ ష్రాఫ్ ఒక కామెంట్ పెట్టేసిది. 24 గంటలు గడవక ముందే ఈ ఫోటోకు 1.7 మిలియన్ లైక్స్ వచ్చాయి. కొందరు చిలిపి నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. "హాయ్ మై మర్ జావా".. "మాకు కాల్విన్స్ కావాలి" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. దిశ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమా లో నటిస్తోంది.