Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: 2020 ని క‌ళ్లు మూసుకుని త‌ల‌చుకుని..!

By:  Tupaki Desk   |   1 Jan 2021 6:50 AM GMT
ఫోటో స్టోరి: 2020 ని క‌ళ్లు మూసుకుని త‌ల‌చుకుని..!
X
టాలీవుడ్ లో యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించిన సోనాల్ చౌహాన్ కి ప‌రిశ్ర‌మ అగ్ర హీరో బాల‌కృష్ణ అవ‌కాశం ఇవ్వ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి బ్యాక్ టు బ్యాక్ ఏరి కోరి సోనాల్ ని ఎంపిక చేసుకోగా.. ఆ త‌ర్వాత న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కూడా మ‌రోసారి బాల‌య్య స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం క‌ల్పించారు. అయినా కానీ సోనాల్ ఫేట్ మార‌లేదు. ఇక్క‌డ వేరే అగ్ర హీరోలు ఎవ‌రూ అవ‌కాశాలైతే ఇవ్వ‌నేలేదు.

ఆ క్ర‌మంలోనే బాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నించింది. అప్ప‌ట్లోనే సోనాల్ చౌహాన్ క్రికెటర్ కెఎల్ రాహుల్ తో డేటింగ్ చేస్తోంది అంటూ ఒక పుకార్ కూడా షికార్ చేసింది. కానీ అది కూడా త‌న‌కు ఆఫ‌ర్ల ప‌రంగా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. అప్ప‌టికే జ‌న్న‌త్ లో హాట్ గాళ్ గా ఆరంగేట్ర‌మే అద‌ర‌గొట్టిన‌ సోనాల్ చౌహాన్ కెరీర్ ప‌రంగా బిజీ అవుతుంది అనుకుంటే ఎఫైర్ల‌తో హాట్ టాపిక్ అయ్యింది.

తన మొదటి చిత్రం జ‌న్న‌త్ లో ఇమ్రాన్ హష్మిని రొమాన్స్ చేసిన సోనాల్ చౌహాన్ గత దశాబ్దంలో హిందీ- తెలుగు- తమిళ భాషలలో సినిమాలు చేసింది. చివరిసారిగా 2018 చిత్రం `పాల్తాన్` లో కనిపించింది. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్నా వాటికి సంబంధించిన తాజా అప్ డేట్ ఏదీ రాలేదు. ఈలోగానే ఇన్ స్టాలో వ‌రుసగా వేడెక్కించే ఫోటోల‌తో ట్రీటిస్తోందిలా. క‌ళ్లు మూసుకుని 2020ని త‌ల‌చుకుంటూ సెండాఫ్ చెప్పేసిందిలా. వైట్ టాప్ చినుగుల డెనిమ్ షార్ట్ లో టూ హాట్ గా క‌నిపించింది సోనాల్. ప్ర‌స్తుతం ఇన్ స్టా ఫోటోలు అభిమానుల్లో వైర‌ల్ అవుతున్నాయి. క‌నీసం 2021 అయినా సోనాల్ కి క‌లిసి రావాల‌ని ఆకాంక్షిద్దాం.