Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చ‌బ్బీ గాళ్ సంథింగ్ హాట్

By:  Tupaki Desk   |   22 Nov 2021 12:30 AM GMT
ఫోటో స్టోరి: చ‌బ్బీ గాళ్ సంథింగ్ హాట్
X
హాట్ బ్యూటీ పూన‌మ్ బ‌జ్వా `ఎన్టీఆర్ -క‌థానాయ‌కుడు` చిత్రంతో టాలీవుడ్ లోకి కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ పూన‌మ్ కి మ‌ళ్లీ క‌లిసి రాలేద‌నే చెప్పాలి. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఆ సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో పూన‌మ్ కెరీర్ మ‌ళ్లీ ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డిలాగే మిగిలిపోయింది. ఇలా పూన‌మ్ కెరీర్ తొలి నుంచి న‌త్త‌న‌డ‌కనే సాగుతోంది. తొలుత తెలుగులో` మొద‌టి సినిమా`తో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. అటుపై మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించింది. కానీ కెరీర్ ఏ ద‌శ‌లోనూ బిజీ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతానికి టాలీవుడ్ లో ఆఫ‌ర్లు ఏమీ లేవు. మ‌ల‌యాళంలో ఓ చిత్రంలో న‌టిస్తోంది.

ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అయితే పూన‌మ్ స‌మ‌కాలీకులు కొంత‌మంది బుల్లి తెర‌పై బిజీ అవుతున్నారు. కానీ ఈ భామ మాత్రం అటువైపు చూసింది లేదు. ఓటీటీలోనూ బెస్ట్ వెబ్ సిరీస్ ల్లో న‌టిస్తూ మార్కెట్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ ర‌కంగాను పూన‌మ్ ప్ర‌య‌త్నాలు క‌నిపించ‌లేదు. మ‌రి ఇలా ఇంకెన్నాళ్లో.. అయితే ఈ హాట్ బ్యూటీ మాత్రం సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ య‌మా స్పీడ్ గానే ఉంటుంది. టెంప్టింగ్ ఫోటోల‌తోనే ఆక‌ట్టుకుంటుంది . వీలైన‌ప్పుడ‌ల్లా అందాలు విచ్చ‌ల‌విడిగా ఆర‌బోస్తూనే ఉంటుంది. తాజాగా మ‌రోసారి వైట్ అండ్ పింక్ బ్లౌజులో ప‌రేషాన్ చేస్తోంది.

పూన‌మ్ చ‌బ్బీ లుక్ కి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందేన‌ని మ‌రోసారి ప్రూవ్ చేసింది. స్టాండింగ్ లో కెమెరాకి ఫోజులిచ్చి చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. బూడిద రంగు సోపా ప‌క్క‌న నుంచొని అలా కురులు స‌ర్దుకుంటున్న‌ట్లు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పూన‌మ్ అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేసి మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇన్ స్టాకి రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటోంది. మ‌ళ్లీ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు ఏమైనా మొద‌లు పెట్టిందా? అన్న‌ది తెలియాలి. చబ్బీ గాళ్ వాట్టూడూ వాట్ నాట్టూడూ? అన్న ప్ర‌శ్న వ‌స్తే.. ప్రస్తుతం పూన‌మ్ మల‌యాళంతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ అవ‌కాశాలు అందుకుంటోంద‌ని స‌మాచారం.