Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఘాటు పంజా విసిరిన చిరుత

By:  Tupaki Desk   |   17 Dec 2019 11:14 AM GMT
ఫోటో స్టోరీ: ఘాటు పంజా విసిరిన చిరుత
X
బాలీవుడ్ లో చాలామంది భామలే ఉంటారు. అయితే అందరూ స్టార్ హీరోయిన్లు కాలేరు. దీపిక.. అలియాల తరహాలో అందరికీ క్రేజ్ రాదు. అయితే ఈ భామలు సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకోవడమే పనిగా పెట్టుకుంటారు. కొందరు ఈ మిషన్లో సూపర్ సక్సెస్ అవుతారు. 'చిరుత' భామ నేహ శర్మ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది కానీ ఈ రెండో మిషన్లో విజయం సాధించింది.

అందుకే ఈ భామకు ఇన్స్టాలో దాదాపు 9 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఇక హాటు ఫోటో షూట్లు అనేవి ఈ భామ జీవితంలో విడదీయలేని భాగం అయ్యాయి. అవి లేకపోతే ఏదో ఒక ఫోటో తీసుకుని ఆవి పోస్ట్ చేస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఒక బీచ్ ఎమోజి క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో నేహ ఒక అందమైన బీచ్ ఒడ్డున తెలుపు రంగు చొక్కా ధరించి నిలుచుంది. అలా తెలుపు చొక్కాతో నిలుచుంటే ఎవరూ ఫోటో స్టొరీలు రాయరు. అందుకే.. ఆ మతలబు తెలుసు కాబట్టి బొత్తాలు పెట్టుకోకుండా హాటు ముంబై రత్తాలు టైపులో అంతః సౌందర్యాన్ని ఫోటోకు ధారపోసింది. పైగా 'మీక్కావలసింది.. నా దగ్గర ఉంది' అని అదేదో తెలుగు పాట లాగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఒక్క ముక్కలో చెప్తే ఫోటో యమ హాటో.. నో డౌటో!

ఇలాంటి ఫోటోలకు ఘాటు కామెంట్లు వస్తాయి కదా.. వచ్చాయి. "సూపర్ హాట్ బ్యూటీ".. "కూల్ బీచ్.. హాట్ బ్యూటీ".. "నువ్వెప్పుడూ ఇంతేనా".. "నేహ.. బటన్లు ఉన్నాయి కదా?" అంటూ కొందరు స్పందించారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అజయ్ దేవగణ్ సినిమా 'తానాజీ' లో నటిస్తోంది. మరో సినిమా 'తైష్'లో కూడా నటిస్తోంది. ఈ రెండూ సినిమాలే కాకుండా 'ఇక్ సాంధు హుండా సి' అనే పంజాబీ సినిమాలో కూడా నటిస్తోంది.