Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శివుని పూజలో చ‌ర‌ణోపాస‌నం

By:  Tupaki Desk   |   12 March 2021 5:30 AM GMT
ఫోటో స్టోరి: శివుని పూజలో చ‌ర‌ణోపాస‌నం
X
మ‌హాశివ‌రాత్రి ఫ‌ర్వ‌దినాన్ని పుర‌ష్క‌రించుకుని టాలీవుడ్ లో ప‌లువురు ప్ర‌ముఖులు శివుని పూజ‌లో త‌రించిన సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా ఉపాస‌న‌-రామ్ చ‌ర‌ణ్ జంట శివ‌రాత్రి పూజ‌ల్లో ఎంతో నిష్ఠ‌గా నిమ‌గ్న‌మైన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. చరణ్ - ఉపసన జంట నిన్నంతా శివాల‌యంలో శివుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూజ‌తో పాటు ఇత‌ర‌ ఆచారాలు పాటిస్తున్న యువ జంట వీడియో అభిమానుల్లో వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో చరణ్ తెల్లటి చొక్కా- ధోతి ధరించి క‌నిపించ‌గా.. ఉపాసన వైట్ చుడిదార్ ధరించారు. మహాశివరాత్రి సందర్భంగా శరీరం-ఆత్మ ఐక్య‌మై శాంతిని స్వచ్ఛతను తీసుకురావడానికి భక్తి ప్రార్థనలను శ్ర‌ద్ధ‌గా ఆచ‌రిద్దాం! అన్న వ్యాఖ్య‌ను ఈ ఫోటోతో జోడించారు. చ‌ర‌ణ్ స్వ‌త‌హాగానే మంచి భ‌క్తుడు. ప్ర‌తియేటా స్వామి అయ్య‌ప్ప మాల‌ను విధిగా ధ‌రిస్తుంటారు. భ‌క్తి ఆధ్యాత్మిక‌ వేడుక‌ల్లోనూ పాల్గొన‌డం చూస్తున్న‌దే. ప్ర‌తియేటా ప్ర‌యాగ కుంభ‌మేళాలో చ‌ర‌ణ్-ఉపాస‌న ప్రార్థ‌న‌ల గురించి తెలిసిందే.

చ‌ర‌ణ్ మ‌రోవైపు కెరీర్ ప‌రంగానూ బిజీ బిజీ. అత‌డు ప్ర‌స్తుతం ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌గా.. అపోలో హెల్త్ సీఈవోగా.. మ్యాగ‌జైన్ క‌ర్త‌గా ఉపాస‌న పూర్తి బిజీగా ఉన్నారు.