Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మ్యాగజైన్ పై బికినీ మంటలు

By:  Tupaki Desk   |   21 March 2020 4:30 PM GMT
ఫోటో స్టోరీ: మ్యాగజైన్ పై బికినీ మంటలు
X
బాలీవుడ్ లో ఈమధ్య ముప్పైల.. నలభైల భామల హంగామా చాలా ఎక్కువగా ఉంటుంది. యోగాలు.. ఇతర కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడమే కాదు.. వారి ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చెయ్యడం.. డిజిటల్ మంటలు పెట్టడం వారికి చాలా సాధారణంగా మారిపోయింది. అయితే ఈమధ్య స్టార్ కిడ్స్ కొందరు ఎంట్రీ ఇవ్వడం తో ఆ లేటు వయసు ఘాటుభామలకు గట్టి పోటీ ఏర్పడింది. అలాంటి స్టార్ కిడ్స్ బ్యాచ్ లో తారా సుతారియ ఒకరు.

ఈ భామ ఎవరు అని అడిగితే కరణ్ జోహార్ పరిచయం చేసిన హీరోయిన్ అని చెప్పాలి. కరణ్ నిర్మాణంలో తెరకెక్కిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' తారకు మొదటి సినిమా. మొదటి సినిమాతోనే గ్లామర్ విషయంలో మంచి మార్కులు తెచ్చుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్. హాటు ఫోటోలతో టెంపరేచర్లు పెంచడం ఇప్పటికే మొదలెట్టింది. ఇక మ్యాగజైన్ కవర్ పేజిలపై కనిపించి తాట తీసే కార్యక్రమం కూడా ఎప్పుడో స్టార్ట్ చేసింది. తాజాగా ఈ భామ గ్లోబల్ స్పా అనే మ్యాగజైన్ కోసం ఓ కత్తి లాంటి ఫోటో షూట్ చేసింది. ఓ అందమైన బీచ్ ఒడ్డున మరింత అందమైన బికినీ ధరించి అందాలను ఆరబోస్తూ సూపర్ పోజిచ్చింది. ఆ కూర్చున్న పోజు.. ఆ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే ఈ భామ బాలీవుడ్ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకునే వరకూ నిద్రపోయేలా కనిపించడం లేదు.

ఈ మ్యాగజైన్ లో తారపై 'ది మిలెనియల్ స్టార్ - తారా సుతారియా' అంటూ ఓ పెద్ద కథనం కూడా ప్రచురించారు. అసలే కొత్త భామ.. ఇరవైల భామ.. కరణ్ జోహార్ కాలేజ్ స్టూడెంట్. దీంతో నెటిజన్లు రెచ్చిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "రెడ్ హాట్ బ్యూటీ".. "తార-ది రియల్ స్టార్".. "న్యూ బాలీవుడ్ బేబ్" అంటూ కొందరు స్పందించారు. ఇక తారా సుతారియా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ 'RX100' రీమేక్ 'తడప్' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సునీల్ శెట్టి తనయుడు ఆహన్ శెట్టి హీరోగా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.