Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వామ్మోవ్! ఉడుంపట్టు ప‌ట్టారు!

By:  Tupaki Desk   |   7 Nov 2019 10:58 AM GMT
ఫోటో స్టోరి: వామ్మోవ్! ఉడుంపట్టు ప‌ట్టారు!
X
ఒకే సినిమాలో ఇద్ద‌రు నాయిక‌లు న‌టిస్తే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క్యాట్ ఫైట్ అంటూ ప్ర‌చార‌మ‌య్యేది. కానీ ఇటీవ‌ల సీన్ మారింది. న‌వ‌త‌రం నాయిక‌లు ఒద్దిక‌గా క‌లిసిపోతున్నారు. ఈగోల‌కు తావు లేకుండా క‌లిసి న‌టిస్తూ ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం తెస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కా చెల్లెళ్ల‌లా .. స్నేహితులుగా క‌లిసిపోతున్నారు.

ఇదిగో ఈ రేర్ మూవ్ మెంట్ ని చూస్తుంటే మీకేమ‌నిపిస్తోంది? అనుష్క‌- అంజ‌లి అక్కా చెల్లెళ్ల‌లా క‌లిసిపోయార‌ని .. బెస్ట్ ఫ్రెండ్స్ కి ప‌ర్యాయ‌ప‌దంలా మారిపోయార‌ని అనిపిస్తోంది క‌దూ? ఒక‌రినొక‌రు అలా హ‌గ్ చేసుకుని స‌ర‌దాగా గాల్లోకి ఎత్తేస్తూ సిల్లీ ఆట‌లు ఆడుకుంటున్న తీరు చూస్తుంటే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఆన్ లొకేష‌న్ ఎలాంటి ర్యాపో కుదిరిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇద్ద‌రి మ‌ధ్యా ఠ‌గ్ ఆఫ్ వార్ చూస్తుంటే అంజ‌లి కంటే అనుష్క ఓ మెట్టు పైనే ఉంది. అంజ‌లిని అమాంతం ఉడుం ప‌ట్టు ప‌ట్టి అలా పైకి ఎత్తేసింది స్వీటీ. అంజ‌లి మాత్రం స్వీటీ అనుష్కను ఇంచి కూడా క‌ద‌ప‌లేక‌పోయింది.

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ‌హుభాషా చిత్రం 'నిశ్శ‌బ్దం'లో అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రానికి మ‌ధు మంతెన ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోన‌వెంక‌ట్ నిర్మిస్తున్నారు. అమెరికాలో మెజారిటీ భాగం చిత్రీక‌ర‌ణ చేశారు. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. త్వ‌ర‌లో సినిమా రిలీజ్ కానుంది.