Begin typing your search above and press return to search.
ఆ సెంటిమెంటును అస్సలు వదలని గురూజీ!
By: Tupaki Desk | 8 Oct 2018 4:43 PM ISTచాలా మంది సెలెబ్రిటీలకు సెంటిమెంట్లు ఉంటాయి. అలానే గురూజీ త్రివిక్రమ్ కూడా తన కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతున్నాడని నెటిజనుల అభిప్రాయం. ముఖ్యంగా త్రివిక్రమ్ తన హీరోలకు ఒక ట్రావెల్ బ్యాగ్ ఇచ్చి ఏదైనా ఊరికి పంపిస్తాడట. నిజంగా ఏదైనా ఊరికి వెళ్ళమని కాదు గానీ స్క్రిప్ట్ లో భాగంగా హీరో పాత్రను ఏదో ఊరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఒక సమస్యను తగిలిస్తాడట..!
ఇప్పటికే ఇలాంటి సెంటిమెంట్ ను 'ఖలేజా'.. 'S/o సత్యమూర్తి'.. 'అ ఆ' లలో ఇలాగే వాడారని ఉదాహరణలు చూపిస్తున్నారు. ఈ సినిమాలలో హీరోలు వెనక ఒక ట్రావెల్ బ్యాగ్ తగిలించుకుని ఉన్న పోస్టర్లు పాపులర్. ఇక తాజాగా విడుదల చేసిన 'అరవింద సమేత' పోస్టర్ లో కూడా యంగ్ టైగర్ ఒక ట్రావెల్ బ్యాగ్ తగిలించుకుని రాయలసీమకు ప్రయాణం చేస్తున్నట్టుగా ఉన్నాడు. రాయలసీమకు ఎందుకు వీరరాఘవుడు బయలుదేరాడో మనకు తెలుసు కదా.. అక్కడికి యంగ్ టైగర్ వెళ్లకపోతే అరవింద స్టోరీ మిల్లి మీటర్ కూడా కదలదు.
అయినా త్రివిక్రమ్ ఈ బ్యాగ్ పోస్టర్ ప్రతి సినిమాలో తన హీరోకు ట్రేడ్ మార్క్ లా ఎందుకు చేస్తున్నాడో ఏంటో..? ఒక్క సుకుమారే జనాలకు అర్థం కాని లాజిక్కులతో సీన్స్ డిజైన్ చేస్తాడని అనుకుంటారు గానీ మన గురూజీ కూడా అలాంటి అర్థం కాని ఫిలసాఫికల్.. మెటాఫిజికల్ లాజిక్ తో జనాలకు పరీక్ష పెడుతున్నాడేమో. ఏదేమైనా బ్యాగ్ సెంటిమెంట్ ను మాత్రం రిపీట్ చేస్తున్నాడని సింపుల్ గా తేల్చేయవచ్చు. బ్యాగుల కంపెనీ వాళ్ళు సేల్స్ కోసం గురూజీ చేత ఇదంతా చేయిస్తున్నారని గుడ్డుపై ఈకలు పీకే వాళ్ళు అనుకోవచ్చు.