Begin typing your search above and press return to search.

పులితో ఫైట్‌ మాస్ట‌ర్ ప‌రాచికాలు

By:  Tupaki Desk   |   21 Jan 2016 3:30 PM GMT
పులితో ఫైట్‌ మాస్ట‌ర్ ప‌రాచికాలు
X
ఫైట్ మాస్ట‌ర్ అంటే సహ‌జంగా ఏం చేస్తారు? సినిమాల్లో హీరోల ఫైట్ సీన్ల‌కు పోజులు చూపిస్తూ ఫైట్లు చేయ‌డంలో మార్గ‌ద‌ర్శ‌కం వ‌హిస్తారు. ఈ ఫైట్ల సీన్ల‌లో న‌దులుంటాయి, రైళ్లుంటాయి, పులులుంటాయి, మొస‌ళ్లు కూడా ఉంటాయి. అయితే ఇవ‌న్నీ సినిమాల మ‌ట్టుకే. కానీ నిజ‌జీవితంలో చేస్తే...అలా ఎవ‌రు చేస్తారేంటి అనుకోకండి. తాను చేపిస్తున్న సీన్‌ లు నిజంగా చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో అనుకున్నారో ఏమో కానీ ఫేమ‌స్ ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్స్ ఇదే ప‌నిలో బిజీగా ఉన్నారు.

సినిమా స్టిల్స్‌ ను అధ్య‌య‌నం చేస్తున్నాడో లేక‌పోతే స‌ర‌దాకు పోజులే ఇస్తున్నాడో తెలియ‌దు కానీ...మాంచి బ‌లిష్టంగా ఉండి, చూస్తేనే గ‌గుర్పాటు క‌లిగించేలా ఉన్న పెద్ద‌పులితో క‌లిసి పోటోల‌కు పోజులు ఇచ్చాడు. అంటే అది బోన్లో ఉందేమో అనుకునేరు. పై ఫొటోలో ఉన్న‌ట్లు హ్యాపీ గా బ‌య‌ట తిరుగుతోంది. ఆ పులిని మ‌చ్చిక చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని, బోర్ల ప‌డుకోబెట్టి న‌డుం నిమురుతూ.....ఇలా వేర్వేరు యాంగిల్స్‌ లో అయ్య‌వారు పోజులు ఇచ్చారు. ఈ ఫొటోల‌న్నీ నెట్‌ లో పెట్ట‌డంతో ఇపుడు పీట‌ర్ హెయిన్స్ పోజులు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి. ఇంత‌కీ ఇలాంటి సినిమాలు రాబోయే ఏదైనా సినిమాలో హీరోల‌తో చేయిస్తాడా ఏంటి అని సినిమా అభిమానులు జోరుగా చ‌ర్చించుకుంటున్నారు.