Begin typing your search above and press return to search.

ఫైట్ మాష్టర్ ఇక సీన్లు కూడా లేపుతాడట

By:  Tupaki Desk   |   8 May 2017 1:09 PM GMT
ఫైట్ మాష్టర్ ఇక సీన్లు కూడా లేపుతాడట
X
అప్పటి మగధీర నుండి మొన్నటి బాహుబలి వరకు.. హీరోలకు తాళ్ళు కట్టేసి గాల్లో లేపాలంటే మాత్రం.. అందరూ వెంటనే పీటర్ హెయిన్స్ పేరు చెబుతారు. వియత్నాం సంతతికి చెందిన ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్.. చెన్నయ్ లో పెరిగాడు. తనను తాను ఒక తమిళయుడుగానే చూసుకుంటాడు. అయితే దేశంలో చాలామంది స్టార్ హీరోలకు మనోడు పర్సనల్ ఫేవరేట్. అయితే ఇప్పుడు ఈయన కొత్తగా సీన్లు కూడా లేపుతాడట.

మొన్నటివరకు కేవలం వైర్లు కట్టి హీరోలను గాల్లోకి లేపి ఫైట్లు మాత్రమే తీసిన ఈ ఫైట్ మాష్టర్.. ఇప్పుడు యాక్షన్ అండ్ కట్ ఏకంగా సీన్లకు కూడా చెబతానంటున్నాడు. అంతేకాదు.. ఒక కథ రాసుకుని.. డైరక్టుగా మలయాళం స్టార్ మోహన్ లాల్ దగ్గరకు వెళ్ళిపోయి వినిపించాడట. కథ వినగానే ఇది అదిరిపోయిందే అని మోహన్ లాల్ కు అనిపించడంతో.. ఆయన స్వయంగా బారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్దపడుతున్నాడు. పైగా తమిళ మలయాళంలో బైలింగువల్ గా రూపొందించి.. తెలుగులోకి కూడా డబ్బింగ్ కొట్టేస్తారట. అది సంగతి.

డ్యాన్సులు కొరియోగ్రాఫ్‌ చేసి ప్రభుదేవా.. లారెన్స్.. అమ్మ రాజేశేఖర్.. దర్శకులుగా మంచి హిట్లే కొట్టారు కాని.. ఫైట్లను తీసిన విజయన్.. థ్రిల్లర్ మంజు.. వంటి మాష్టర్లు మాత్రం యాక్టర్లుగా క్లిక్ అయ్యారే తప్ప డైరక్టర్లుగా క్లిక్ అవ్వలేదు. చూద్దాం పీటర్ హెయిన్స్ ఏం చేస్తాడో!!