Begin typing your search above and press return to search.

గుర్రం మ‌ర‌ణానికి కార‌ణం? మ‌ణిర‌త్నంపై PETA ఇండియా కేసు!

By:  Tupaki Desk   |   3 Sep 2021 7:30 AM GMT
గుర్రం మ‌ర‌ణానికి కార‌ణం? మ‌ణిర‌త్నంపై PETA ఇండియా కేసు!
X
మూగ‌జీవాల‌ను తీవ్ర‌మైన అల‌స‌ట‌కు గురి చేసే సినిమాల షూటింగుల‌కు వినియోగించ‌కూడ‌దు. ఒక‌వేళ అలా వినియోగించాల్సి వ‌స్తే ముందుగా కొన్ని అనుమ‌తులు అవ‌స‌రం అవుతాయి. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇటీవ‌లి కాలంలో సినిమాల కోసం మూగ జీవాల‌ను హింసించ‌కూడ‌ద‌ని చ‌ట్టం రూపొందిన సంగ‌తి తెలిసిందే. మూగ జీవాల సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల‌తో నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండే PETA ఇండియా ఇప్పుడు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంపై పోలీస్ కేసు న‌మోదు చేసింది.

దురదృష్టకరమైన సంఘటనలో ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నం చారిత్రక అద్భుత చిత్రం `పొన్నియిన్ సెల్వన్` సెట్ లో ఇటీవల ఒక గుర్రం మరణించింది. తాజా మీడియా క‌థ‌నాల ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్ పైనా.. షూటింగుకి గుర్రాన్ని అప్ప‌గించిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది.

అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429 ఐపిసి 1960 సెక్షన్ 11 .. సెక్ష‌న్ 1860 కింద కేసు నమోదు చేశారు. గుర్రం అలసటతో నిర్జలీకరణం(తిండి నీళ్లు లేక నీర‌సం)తో ఉందని నిరంతర షూట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని `పెటా ఇండియా` ఆరోపించింది. నిజమైన జంతువులను ఉపయోగించకుండా బదులుగా కంప్యూటర్ గ్రాఫిక్ లను ఉపయోగించకుండా అన్ని చిత్రనిర్మాతలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని PETA ఇండియా అన్ని జంతు సంక్షేమ బోర్డుల‌ను అభ్యర్థించింది. నిజానికి ఇటీవ‌ల చాలా సినిమాల‌కు కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ ని మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. అప్ప‌ట్లో బాహుబ‌లి చిత్రంలో బుల్ ఫైట్ కోసం రాజ‌మౌళి స‌మ‌ర్థ‌వంతంగా గ్రాఫిక్స్ ని వినియోగించారు.

రాజేంద్రుడు గ‌జేంద్రుడు త‌ర్వాత మ‌రొక‌టి లేదు!

రాజేంద్ర ప్ర‌సాద్ క‌థానాయ‌కుడి గా ఎస్వీ కృష్ణారెడ్డి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రాజేంద్రుడు గ‌జేంద్రుడులో ఏనుగు (గ‌జేంద్రుడు) అద్భుత న‌ట ప్ర‌ద‌ర్శ‌న షో స్టాప‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఒక‌ జంతువును పాత్ర‌ధారిని చేసి ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు ఎస్వీకే. ఇందులో సౌంద‌ర్య క‌థానాయిక‌గా న‌టించారు. కోట శ్రీ‌నివాస‌రావు-బాబు మోహ‌న్ - గుండు హ‌నుమంత‌రావు కామెడీ అద్భుతాలు చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శ‌త‌దినోత్స‌వాల‌తో పాటు కొన్ని కేంద్రాల్లో 365రోజులు ఆడింది ఈ చిత్రం. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో పాక్షికంగా మాత్ర‌మే మూగ జీవాల‌ను ఉప‌యోగించారు కానీ పూర్తి నిడివి సినిమాలు తీయ‌లేదు. దానికి కార‌ణం పెటాతో ఉన్న చిక్కులే. అప్ప‌ట్లో శేఖ‌ర్ క‌మ్ముల ఓ సినిమాలో కుక్క ను యానిమేష‌న్ లో చూపించారు. మ‌ళ్లీ ఇంత‌కాలానికి మ‌ణిర‌త్నం గుర్రాల‌తో ప్ర‌యోగాలు చేస్తున్నారు. హిస్టారిక‌ల్ క‌థాంశానికి గుర్రాన్ని ఉపయోగిస్తున్నారు.

ఆస‌క్తిక‌రంగా మ‌ణిర‌త్నం కి ఎంతో స‌న్నిహితులు అయిన అమ‌ల అక్కినేని .. అగ్ర క‌థానాయిక త్రిష కూడా పెటా స‌భ్యులుగా ఉన్నారు. అయితే మ‌ణి స‌ర్ గుర్రాన్ని పొన్నియ‌న్ సెల్వ‌న్ కోసం ఉప‌యోగిస్తున్న విష‌యం వీళ్లంద‌రికీ ముందే తెలియ‌ద‌ని అంటారా? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌నులు.