Begin typing your search above and press return to search.

సారీ చెప్పి మరీ సూర్యకి కౌంటర్లు

By:  Tupaki Desk   |   29 Jan 2017 9:32 AM GMT
సారీ చెప్పి మరీ సూర్యకి కౌంటర్లు
X
జల్లికట్టును పెటా సంస్థ వ్యతిరేకించడం కోర్టును ఆశ్రయించడంపై.. ఇప్పుడు దాన్ని తీవ్రవాద సంస్థతో సమానంగా ట్రీట్ చేస్తున్నారు తమిళనాడు వాసులు. ఈ మధ్యలో జల్లికట్టును సపోర్ట్ చేస్తూ సూర్య కామెంట్స్ చేయడం.. సినిమా ప్రమోషన్స్ కోసం జల్లికట్టును ఉపయోగించుకుంటున్నాడంటూ పెటా కౌంటర్ ఇవ్వడంతో.. వివాదం చెలరేగింది.

పెటాకు లీగల్ నోటీసులు పంపడంతో.. ఈ వివాదం తారా స్థాయికి చేరింది. ఇప్పుడు లీగల్ నోటీసులు అందుకున్న పెటా.. సూర్యకు ఓ క్షమాపణ పత్రం పంపింది. అందులో మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్లు పెటా సీఈఓ పూర్వ జోషిపురా చెప్పినా.. మొత్తం మ్యాటర్ లో మాత్రం ఎక్కువగా కౌంటర్స్ ఉండడం ఆశ్చర్యకరం. 'జల్లికట్టుకు మద్దతుగా మీరు చేసిన కామెంట్స్.. అప్పటికే విడుదలకు రెడీ అయిన మీ సినిమాతో సంబంధం లేనివిగా మీరు చెప్పిన మాటలు నిజమే అయితే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. మీరు అగరం ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు సపోర్ట్ ఇస్తారు. అలాగే జంతువులకు కూడా హాని జరకుండా ఉండాలని మేం భావించాం. మనుషుల.. జంతువుల మరణాలకు కారణమవుతున్న జల్లికట్టును మీరు సమర్ధించడాన్ని మేం నమ్మలేకపోయాం. దిండిగల్ ఓ 14 ఏళ్ల చిన్నారి మరణించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మేం మంచి సినిమా ప్రమోషన్స్ కు మద్దతు ఇస్తాం. కానీ జీవాలపై క్రూరత్వం చూపేవాటిని మాత్రమే వ్యకిరేకిస్తాం. మీరు కూడా ఇలాగే అనుకుంటారని మేము భావించాం" అని లేఖలో పేర్కొంది పెటా.

'ప్రభుత్వ విభాగం అయిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జల్లికట్టు ఈవెంట్స్ లో జరుగుతున్న క్రూరమైన వాస్తవాలకు చెందిన ఈ వీడియోలను చూడండి. సింగంలో మూరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ చట్టం 1960 ప్రకారం మీరు తీసుకునే చర్యలు ఏంటో ఆలోచించండి' అంటూ లేఖలో రాశారు. సింగంలో పోలీస్ కేరక్టర్ చేస్తున్నపుడు చట్టాన్ని ఫాలో అవాలి కదా అన్నది పెటా వెర్షన్. మరి దీనికి సూర్య ఎలా స్పందిస్తాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/