Begin typing your search above and press return to search.

ఇప్పుడు స్క్రీన్‌ ఏదైనా చూసేస్తున్నారు

By:  Tupaki Desk   |   9 Nov 2020 9:45 AM IST
ఇప్పుడు స్క్రీన్‌ ఏదైనా చూసేస్తున్నారు
X
ప్రస్తుతం ఇండియాలో వెబ్‌ సిరీస్‌ ల జోరు పెరిగింది. ముఖ్యంగా ఈ కరోనా టైమ్‌ లో ప్రేక్షకులు ఎక్కువగా వెబ్‌ సిరీస్‌ కు మక్కువ చూపుతున్న కారణంగా ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌ ల వెంట పరుగులు తీస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో ఇండియాలో వెబ్‌ సిరీస్ ల నిర్మాణం జరుగుతుంది. కేవలం హిందీ అనే కాకుండా స్థానిక భాషల్లో కూడా వెబ్‌ సిరీస్‌ లు మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి. ముందు ముందు భారీ వెబ్‌ సిరీస్‌లు బుల్లి స్క్రీన్‌ పై చూడబోతున్నాం. అయితే 2014 సంవత్సరంలో ఇండియాలో వెబ్‌ సిరీస్‌ లకు పెద్దగా ఆధరణ లేదు. అది కాకుండా యూట్యూబ్‌ లో ప్రసారం అయ్యే వెబ్‌ సిరీస్ లను ఎవరు చూస్తారు అంటూ అంతా పెదవి విరిచిన సమయంలో పర్మినెంట్‌ రూమ్మెట్స్‌ వెబ్‌ సిరీస్‌ యూట్యూబ్‌ లో వచ్చింది.

అప్పటికే సినిమాల్లో నటిగా బిజీగా ఉన్న నిధి సింగ్‌ ఆ వెబ్‌ సిరీస్‌ లో నటించింది. దాంతో ఇండియాలో తొలి వెబ్‌ సిరీస్‌ హీరోయిన్‌ గా నిధి సింగ్‌ పేరు దక్కించుకుంది. నటిగా ఆఫర్లు వస్తున్న సమయంలో ఏమాత్రం క్రేజ్‌ లేని యూట్యూబ్‌ వెబ్‌ సిరీస్‌ లో నటించడం అంటే తలతిక్క నిర్ణయం అంటూ ఆమెను చాలా మంది వ్యతిరేకించారు. కాని ఆమె మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చేసింది. ఆమె అనుకున్నట్లుగానే వెబ్‌ సిరీస్‌ మెప్పించింది. పర్మినెంట్‌ రూమ్మెంట్స్‌ వెబ్‌ సిరీస్‌ ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ ను తెచ్చి పెట్టింది. అదే ఎన్నో సినిమాల్లో ఆఫర్లను కూడా తెచ్చి పెట్టింది.

నేను మొదట ఆ వెబ్‌ సిరీస్‌ చేస్తున్న సమయంలో చాలా మంది నన్ను హెచ్చరించారు.. కొందరు నన్ను తల తిక్క పని చేస్తుంది అంటూ విమర్శించారు. కాని నేను మాత్రం నా ప్రతిభపై నమ్మకంతో ఉన్నాను. స్ట్రీన్‌ ఏదైనా ట్యాలెంట్‌ ఉంటే ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది అనుకున్నాను. ఇప్పుడు ప్రేక్షకులు ట్యాలెంట్‌ కంటెంట్‌ ను మాత్రమే చూస్తున్నారు.. స్క్రీన్‌ ఏదైనా కూడా తేడా లేదు అంటున్నారు. అందుకే వెబ్‌ సిరీస్‌ లకు ఇంత ఆధరణ పెరిగిందని నిధి సింగ్‌ పేర్కొంది.