Begin typing your search above and press return to search.

పీరియాడిక్ మల్టీ స్టారర్ - ఇదో కొత్త ట్రెండ్

By:  Tupaki Desk   |   7 April 2019 5:08 AM GMT
పీరియాడిక్ మల్టీ స్టారర్ - ఇదో కొత్త ట్రెండ్
X
మెల్లగా బయోపిక్ ల ట్రెండ్ ఓ కొలిక్కి వస్తోంది. జనం పదే పదే వీటిని ఆదరించే అవకాశాలు తగ్గుతుండటం తో నిర్మాతలు రూటు మారుస్తున్నారు. కథల కొరతతో అన్ని బాషా పరిశ్రమలు అల్లాడుతున్నాయి. ప్రేక్షకులను మెప్పించే కథలు ఏమైతే బాగుంటాయా అనే విషయంలో కిందా మీద పడుతున్నాయి. అందుకే ఇప్పుడు పీరియాడిక్ డ్రామాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

ఎప్పుడో నలభై యాభై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటలను వ్యక్తుల జీవితాలను ఆధారంగా చేసుకుని కోట్ల రూపాయల బడ్జెట్ తో మల్టీ స్టారర్లు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 17న విడుదల కానున్న బాలీవుడ్ మూవీ కళంక్ ఇదే కోవలోకి వస్తుంది. ఇప్పుడు భుజ్ అనే మరో మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం అవుతోంది. 1971 బ్యాక్ డ్రాప్ లో ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపధ్యాన్ని తీసుకుని భారీ ఎత్తున దీన్ని నిర్మించబోతున్నారు. మొన్న శుక్రవారం వచ్చిన రోమియో అక్బర్ వాల్టర్ ఇదే కోవలోకి వచ్చిందే.

ఇక భుజ్ విషయానికి వస్తే అజయ్ దేవగన్-సంజయ్ దత్-పరిణీతి చోప్రా-సోనాక్షి సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా నటించనుండగా పరిణితి చోప్రా మొదటిసారి సీక్రెట్ ఏజెంట్ పాత్ర చేస్తోంది. రాజీలో అలియా భట్ టైపులో అన్న మాట. ఇదిలా ఉంచితే షూటింగ్ లో మరో నాలుగు సినిమాలు ఇలాంటి పీరియాడిక్ డ్రామాలను ఆధారం చేసుకుని రూపొందుతున్నవే ఎక్కువగా ఉన్నాయి.

ఎవరిదాకో ఎందుకు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం తీసుకున్న బ్యాక్ డ్రాప్ కూడా 1920 నాటిది. వర్తమాన అంశాలతో రూపొందే వాటిలో రిస్క్ ఎక్కువవుతోంది కాబట్టి మల్టీ స్టారర్స్ కు దర్శకులు తెలివిగా ఈ ప్లాట్స్ ను తీసుకుంటున్నారు. ఏ ట్రెండ్ అయినా దానికో ఎక్స్ పైరీ ఉంటుందని. మరి ఈ పీరియాడిక్ డ్రామాలు ఎప్పటిదాకా సాగుతాయో వేచి చూడాలి. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో సైతం రంగస్థలం లాంటి మూవీస్ కాలాన్ని వెనక్కు తీసుకెళ్లి కథలు చెప్పాలన్న ప్రయత్నాలకు బలాన్ని చేకూర్చాయి