Begin typing your search above and press return to search.

ప‌ర్ఫెక్ట్ అథ్లెట్ అంటే RC నో డౌట్

By:  Tupaki Desk   |   5 Feb 2022 8:30 AM GMT
ప‌ర్ఫెక్ట్ అథ్లెట్ అంటే RC నో డౌట్
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇండ‌స్ట్రీ హిట్ లు అందుకున్నారు. న‌టించిన రెండో సినిమా మ‌గ‌ధీర తో ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గరాసినా .. ఆ త‌ర్వాత వ‌రుస మ‌సాలా చిత్రాల‌ను మాత్ర‌మే చేయ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ క్ర‌మంలోనే త‌ని ఒరువ‌న్ రీమేక్ ధృవ తో ఇమేజ్ ని మార్చుకున్నాడు. ఈ చిత్రంలో యువ ఐపీఎస్ అధికారిగా చ‌ర‌ణ్ మేకోవ‌ర్ కానీ న‌ట‌న కానీ విస్మ‌య‌ప‌రుస్తాయి. అంత‌గా ఛేంజ్ చూపించాడు. ఆ త‌ర్వాత వెంట‌నే రంగ‌స్థ‌లంలో చిట్టి బాబు పాత్ర‌తో మ‌రింత‌గా మార్పు చూపించి ఆక‌ర్షించాడు.

ఆర్.ఆర్.ఆర్ లో యుద్ధ‌వీరుడిగా క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీకోసం అతడి మేకోవ‌ర్ యూనిక్ అన్న ప్ర‌శంస‌లు కురిసాయి. అల్లూరి సీతారామ‌రాజుగా.. కాప్ గా డ్యూయ‌ల్ షేడ్ తో అల‌రించ‌నున్నాడు. ఇక ప్ర‌తిసారీ త‌న రూపం మార్చుకునేందుకు చ‌ర‌ణ్ ఏం చేస్తారో తెలిసిందే. నిరంత‌రం జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ అత‌డు చేసే హార్డ్ వ‌ర్క్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే అథ్లెటిక్ లుక్ తో చ‌ర‌ణ్ ఛామింగ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తాజాగా చర‌ణ్ కొత్త అథ్లెటిక్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ప‌ర్ఫెక్ట్ అథ్లెటిక్ వేర్ లో క‌నిపించాడు చెర్రీ. మ‌రోసారి త‌న లుక్ ఛేంజ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డింది. రూపంలో న‌ట‌న‌లో ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం కోసం ప్ర‌య‌త్నిస్తూ టాలీవుడ్ లో త‌న స్థాయి త‌గ్గ‌కుండా ప్ర‌య‌త్నిస్తున్నాడు చ‌ర‌ణ్‌. దానికి త‌గ్గ గుర్తింపు ప్ర‌తిఫ‌లాన్ని కూడా అందుకుంటున్నాడు.

ఇటీవ‌లి స‌మాచారం మేర‌కు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత‌కాలంగా ముంబైలో ఉంటున్నారు. బాంద్రాలో ఉన్న నైక్ స్టోర్ నుండి బయటకు వచ్చినప్పుడు ముంబై ఫోటోగ్రాఫ‌ర్ల కంటికి చిక్కాడు. దీంతో అత‌డిపై ఫ్లాష్ లు మెరిసాయి. వాటినుంచి అరుదైన ఫోటో ఇది.

RRR నటుడిగా ఇప్పుడు చెర్రీకి బాలీవుడ్ లో ఉన్న గుర్తింపు వేరు. అందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అత‌డు నలుపు రంగు స్పోర్ట్ జాకెట్ .. బూట్లు అలాగే మ్యాచింగ్ టోపీ ధరించాడు. అతను సాధారణ దుస్తులలో తన ఆకర్షణీయమైన చిరునవ్వుతో కెమెరాలకు పోజు ఇచ్చాడు. తాజాగా చెర్రీకి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. త‌దుప‌రి శంకర్ దర్శకత్వంలో హై-బడ్జెట్ మూవీ షూటింగ్ లో చ‌ర‌ణ్ బిజీ కానున్నాడు. తాజా షెడ్యూల్ కోసం శంక‌ర్ ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేశారని తెలుస్తోంది. ముంబై ప‌రిశ్ర‌మ‌లో త‌న‌ని తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు చ‌ర‌ణ్ ఇటీవ‌ల స‌రికొత్త ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.