Begin typing your search above and press return to search.

పెన్నీ కాయిన్స్ తో SVP దుమారం!

By:  Tupaki Desk   |   10 May 2022 6:00 PM IST
పెన్నీ కాయిన్స్ తో SVP దుమారం!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `స‌ర్కారు వారి పాట` రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌లైంది. రిలీజ్ కి ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉంది. దీంతో ప్ర‌చారం పీక్స్ కి చేరింది. మ‌హేష్ గ్రూప్ ఇంట‌ర్వ్యూలు..వ్య‌క్తిగ‌త చిట్ చాట్ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మ‌రోవైపు మ‌హేష్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ఠారెత్తిస్తున్నారు.

తాజాగా ఫ్యాన్స్ పెన్నీ కాయిన్స్ త‌యారు చేసి వాటిని సూప‌ర్ స్టార్ కృష్ణ‌ చేతుల మీదుగా లాంచ్ చేసి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. కాయిన్ పై మ‌హేష్ బొమ్మ‌...`స‌ర్కారు వారి పాట` టైటిల్ క‌నిపిస్తుంది. నెల్లూరు లోని ఓ అభిమాని ఈ ర‌క‌మైన ఆలోచ‌న‌తో క‌ద‌ల‌డంతో మిగ‌తా అభిమానులు తోడ‌య్యారు. పెన్నీ కాయిన్ కి త‌యారు చేయ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. మ‌హేష్ మెడ‌పై రూపాయి కాయిన్ టాటూ ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌హ‌ష్ పాత్ర‌కి అనుగుణంగా ఆ టాటూ డిజైన్ చేసారు. స‌రిగ్గా స‌ర్కారు వారి పాట టైటిట్ కి యాప్ట్ అయ్యేలా ఆ డిజైన్ పోస్ట‌ర్స్ లో హైలైట్ అయింది. అందుకే ఇప్పుడు అభిమానులు పెన్నీ కాయిన్స్ తో ఇలాంటి ప్ర‌చారానికి దిగిన‌ట్లు తెలుస్తోంది. కొత్త ర‌క‌మైన ఈ ప్ర‌చారం సినిమాకి మ‌రింత బ‌జ్ తీసుకొస్తుంది. పెన్నీ కాయిన్...ఒరిజిన‌ల్ రూపాయి కాసు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

అభిమానుల ప్రచారం ఇటీవ‌ల కాలంలో కొత్త పుంత‌లు తొక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారం కోసం అభిమానులే సొంత‌ డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నారు. డ‌బ్బుని మంచి నీళ్ల‌లా రాజీ లేకుండా అభిమానం పేరుతో ఖ‌ర్చు చేస్తున్నారు. ఇంత‌కు ముందు `ఆర్ ఆర్ ఆర్` చిత్రం విష‌యంలో ఇలాగే పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేసారు చ‌ర‌ణ్‌..తార‌క్ ఫ్యాన్స్.

అమెరికాలో కార్ల‌పై సినిమా బొమ్మ‌లేసి సిటీల మొత్తం రౌండ్లు కొట్లారు. అలాగే చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్స్ లోకి దూరిపోయి బైక్ ర్యాలీలు నిర్వ‌హించారు. ఇదంతా కేవ‌లం అభిమానం. తెలుగు హీరోలంటే ఆ మాత్రం ఉంటుంది మ‌రి. మే 12న భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సినిమా ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తుందో చూడాలి.

ఇటీవ‌లే రిలీజ్ అయిన `భీమ్లా నాయ‌క్`.. `ఆర్ ఆర్ ఆర్` పెద్ద స‌క్సెస్ సాధించాయి. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన రెండు అగ్ర హీరోల చిత్రాలు `రాధేశ్యామ్`..`ఆచార్య` తీవ్ర నిరాశ‌ని మిగిల్చాయి. మ‌రి స‌ర్కారు వారి పాట స‌క్సెస్ స‌ర‌స‌న నిలుస్తుందా? మిగ‌తా రెండు చిత్రాల ప‌క్క‌న ఉంటుందా? అన్న‌ది 12వ తేదీ ఫ‌లితాన్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంది.