Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో టాలీవుడ్ క్రేజీ సినిమాలు.. అక్క‌డ హీరో ఎవ‌రైతే బెస్ట్?

By:  Tupaki Desk   |   29 Nov 2020 3:30 AM GMT
బాలీవుడ్ లో టాలీవుడ్ క్రేజీ సినిమాలు.. అక్క‌డ హీరో ఎవ‌రైతే బెస్ట్?
X
తెలుగు సినిమాల అనువాదాల‌కు హిందీ ఆడియెన్ లో విప‌రీత‌మైన గిరాకీ పెరుగుతోంది. అందుకే ఇటీవ‌ల వ‌రుస‌గా మ‌న సినిమాల్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు హిందీ నిర్మాత‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. తెలుగు సినిమాల అనువాదాల‌పైనా జోరుగానే బిజినెస్ సాగిస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌భాస్- ఛ‌త్రపతి.. ఎన్టీఆర్- ఊసరవెల్లి చిత్రాల‌ హిందీ రీమేక్ కి ప్లాన్ రెడీ అవుతోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన‌ బ్లాక్ బస్టర్ చిత్రం రేస్ గుర్రం త్వరలో హిందీలో రీమేక్ కానుంద‌ట‌. రేసుగుర్రం పూర్తి కామెడీ యాక్ష‌న్ చిత్రం. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో బ‌న్ని- కిక్ శ్యామ్ అన్న‌ద‌మ్ములుగా అద‌ర‌గొట్ట‌గా.. భోజ్ పురి న‌టుడు కిష‌న్ ఇర‌గ‌దీశాడు.

పెన్ స్టూడియోస్ ఈ చిత్రం రీమేక్ హక్కులను ఫాన్సీ ధరకు సొంతం చేసుకుందిట‌. పెన్ స్టూడియోస్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ - వివి వినాయక్ ల కాంబినేష‌న్ తో హిందీలో చత్రపతి రీమేక్ ‌ను నిర్మిస్తోంది. రేస్ గుర్రం రీమేక్ కోసం న‌టీన‌టుల్ని వెతుకుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలిసింది. ఛ‌త్ర‌పతి .. రేస్ గుర్రం రీమేక్ లలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోమ‌ని కోర‌గా.. బెల్లంకొండ శ్రీనివాస్ చత్రపతిని రీమేక్ లో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. రేసుగుర్రం రీమేక్ లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది కాస్త ఆగితే కానీ తెలీదు.