Begin typing your search above and press return to search.

రోష‌న్ కోసం శ్రీ‌కాంత్ భారీ స్కెచ్ వేశాడా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:30 AM GMT
రోష‌న్ కోసం శ్రీ‌కాంత్ భారీ స్కెచ్ వేశాడా?
X
అనుష్క టైటిల్ రోల్ లో న‌టించిన ఛారిత్రాత్మ‌క సినిమా `రుద్ర‌మ‌దేవి`. గుణ‌శేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేశాడు హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్‌. ఆ త‌రువాత అత‌న్ని గ్రాండ్ గా హీరోగా లాంఛ్ చేయాల‌ని శ్రీ‌కాంత్ భారీ ప్లాన్స్ వేసుకుంటే హీరో అక్కినేని నాగార్జ‌న‌, ఆయ‌న స్నేహితుడు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ హైజాక్ చేయ‌డం.. `నిర్మ‌లా కాన్వెంట్‌` అనే సాదీ సీదా సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం జ‌రిగిపోయాయి.

సినిమా కూడా శ్రీ‌కాంత్ అనుమానించిన‌ట్టుగానే ఏ స్థాయిలోనూ ఆక‌ట్టుకోలేక చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. ఇలా కాదు ఈ సారి ప‌క్కా ప్లానింగ్ తో భారీ సినిమాతో రోష‌న్ రీ ఎంట్రీ ని ప్లాన్ చేశాడు శ్రీ‌కాంత్‌. అదే కె. రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోనంకి రూపొందించిన `పెళ్లి సంద‌డి`. శ్రీ‌లీల హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ రోహన్ కి మంచి పేరు తెచ్చిపెట్టిందే కానీ ఆశించిన స్థాయి స‌క్సెస్ ని మాత్రం అందించ‌లేక‌పోయింది.

అయితే ఈ మూవీలోని పాట‌లు మాత్రం మంచి ఆద‌ర‌ణ పొందాయి. అవే జ‌నాన్ని థియేట‌ర్ల‌కు తీసుకొచ్చాయి. దీంతో `పెళ్లి సంద‌డి` బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర‌వాలేద‌నిపించింది. 2021 అక్టోబ‌ర్ 15న ఈ మూవీ విడుద‌లైంది. ఇప్ప‌టికి ఏడాది దాటింది. ఈ సినిమా త‌రువాత రోష‌న్ నుంచి మ‌రో సినిమా రాలేదు. మ‌రో అప్ డేట్ కూడా రాలేదు. కానీ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు నాట ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ చిన్న‌ది శ్రీ‌లీల మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది.

ర‌వితేజ‌తో శ్రీ‌లీల క‌లిసి న‌టించిన `ధ‌మాకా` మూవీ రీసెంట్ గా విడుద‌లై శ్రీ‌లీల ఖాతాలో సూప‌ర్ హిట్ ని చేర్చింది. త్వ‌ర‌లో మ‌రికొన్ని సినిమాల్లోనూ న‌టించ‌బోతోంది. ఇప్ప‌టికే అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ హీరోగా మొద‌లైన సినిమాలో శ్రీ‌లీల న‌టిస్తోంది. అయితే ఇందులో త‌న‌ది బాల‌య్య‌కు కూతురి పాత్ర‌. హీరోయిన్ ప‌రిస్థితి ఇలా వుంటే హీరో రోష‌న్ మాత్రం ఇంత వ‌ర‌కు కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వ‌క పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

రోష‌న్ సైలెంట్ అయిపోయాడా.. సైలెంట్ గా వ‌స్తున్నాడా? అని కామెంట్ లు మొద‌ల‌య్యాయి. అయితే తండ్రి శ్రీ‌కాంత్ మాత్రం ఈసారి భారీ నిర్మాణ సంస్థ‌ల‌ని రోష‌న్ కోసం లైన్ లో పెట్టిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్, యువీ, మైత్రీ వంటి సంస్థ‌ల‌తో పాటు మ‌రి కొన్ని కీల‌క ప్రొడ‌క్ష‌న్ హౌస్ ల‌ని కూడా శ్రీ‌కాంత్ లైన్ లో పెట్టార‌ని, త్వ‌రలోనే అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ తో రోషన్ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న రాబోతోంద‌ని ఇన్ సైడ్ టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.