Begin typing your search above and press return to search.
పెళ్లి సందడి' జోడీ కుదిరింది
By: Tupaki Desk | 28 Oct 2020 9:00 AM ISTపాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి ని ప్రేక్షకులు ఇంకా గుర్తు పెట్టుకున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మళ్లీ అదే టైటిల్ తో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ప్రకటన కూడా వచ్చిన విషయం తెల్సిందే.
పెళ్లి సందడి సినిమా ప్రకటించినప్పటి నుండి హీరో ఎవరు.. హీరోయిన్ ఎవరు అంటూ అనేక రకాల పుకార్లు షికార్లు చేశాయి. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక హీరో విషయంలో మొదటి నుండి కూడా శ్రీకాంత్ తనయుడు రోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతడికి జోడీ ఎట్టకేలకు ఖరారు అయ్యింది.
పెళ్లి సందడిలో రోహాన్ కు జోడీగా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేశారు. అతడి కోసం పలువురిని ఆడిషన్స్ కూడా చేశారు. కాని ఏది వర్కౌట్ అవ్వలేదు. చివరకు పలు తెలుగు సినిమాల్లో నటించి ఇటీవల కూడా ఒరేయ్ బుజ్జిగా సినిమాలో నటించిన మాళవిక నాయర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రోహాన్ మరియు మాళవికల మీద ఫొటో షూట్ మరియు టెస్ట్ షూట్ కూడా జరిగిందని అంటున్నారు. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని వెళ్లడించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రొనన్కి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్న నేపథ్యంలో రాఘవేంద్ర రావు స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు.