Begin typing your search above and press return to search.

పెళ్లి సందD ఓటీటీ రిలీజ్.. ఆలస్యం ఎందుకంటే?

By:  Tupaki Desk   |   22 Jun 2022 11:30 AM GMT
పెళ్లి సందD ఓటీటీ రిలీజ్.. ఆలస్యం ఎందుకంటే?
X
సాధారణంగా ఈ రోజుల్లో ఎలాంటి సినిమా విడుదలైనా కూడా ఓటీటీ లోకి రావడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. RRR లాంటి బడా సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 రోజులకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇక డిజాస్టర్ సినిమాలు కొన్ని రెండు వారాల అనంతరం కూడా వస్తున్నాయి. అయితే జస్ట్ ఫ్లాప్ కానీ పెళ్లి సందD సినిమా ఎటు కాకుండా 8 నెలల అనంతరం ఓటీటీ లోకి వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రొనాంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా రీ లాంచ్ అయ్యాడు. అలాగే కన్నడ బ్యూటీ శ్రీ లీలా గ్లామరస్ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకు కీరవాణి అందించిన పాటలు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

అయితే ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 15న థియేట్రికల్ గా విడుదలయ్యింది. పెళ్లి సందD సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకు వచ్చి పరవాలేదు అనే విధంగా ఆడింది.

అయితే సినిమా విసుదలైన 8 నెలల తరువాత ఓటీటీలో విడుదల అవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకు ఇంతగా ఆలస్యం అయ్యింది అనే వివరాల్లోకి వెళితే.. రిలీజ్ టైమ్ లో పెళ్లి సందD నిర్మాతలు సినిమా ఓటీటీ హక్కుల డీలింగ్స్ విషయంలో సరైన ఒప్పందం కుదరలేదట.

సరైన రేటుకు గిరాకీ కాకపోవడంతో అలా డీలింగ్ విషయంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక సినిమా వచ్చి నెలలు గడిచిపోవడంతో ఎవరు పట్టించుకోలేదు. దీంతో వచ్చిందే లాభం అనుకోని ఇటీవల జీ 5 తో ఒక డీలింగ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఫైనల్ గా సినిమాను జీ5 లో ఈ నెల 24వ తేదీన శుక్రవారం విడుదల చేయబోతున్నారు. సినిమా చాలా ఆలస్యంగా ఓటీటీ లోకి వస్తుండడంతో సోషల్ మీడియాలో పెద్దగా హడావుడి ఏమి కనిపించడం లేదు. మరి పెళ్లి సందD ఓటీటీ లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.