Begin typing your search above and press return to search.

'ఓ బేబీ' డైరెక్టర్ తో 'పెళ్లి సందడి' హీరో..?

By:  Tupaki Desk   |   19 April 2022 5:30 PM GMT
ఓ బేబీ డైరెక్టర్ తో పెళ్లి సందడి హీరో..?
X
'అలా మొదలైంది' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నందినీ రెడ్డి.. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. 'జబర్దస్త్' 'కల్యాణ వైభోగమే' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నందిని.. 'ఓ బేబీ' మూవీతో సూపర్ హిట్ అందుకుంది. దీని తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

'అన్నీ మంచి శకునములే' చిత్రంలో సంతోష్ శోభన్ - మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 'జాతిరత్నాలు' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన స్వప్న సినిమాస్ సంస్థ ఈ సినిమాని రూపొందిస్తోంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలోనే విడుదల కానుంది.

అయితే ఇదే స్వప్న సినిమాస్ బ్యానర్ లో నందినీ రెడ్డి మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా నటించనున్నారని చెప్పుకుంటున్నారు.

'నిర్మలా కాన్వెంట్' 'రుద్రమదేవి' చిత్రాల్లో నటించిన రోషన్.. గతేడాది 'పెళ్లి సందD' సినిమాతో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఫలితం ఎలా ఉన్నా రోషన్ కు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. యాక్టింగ్ తో పాటుగా డ్యాన్సులు కూడా చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా రోషన్ రెండో చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

రోషన్ హీరోగా వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.9 గా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ ప్ర‌దీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని పేర్కొంటూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అయితే ఇప్పుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో రోషన్ హీరోగా జాతి రత్నాలు నిర్మాతలు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.