Begin typing your search above and press return to search.

ఆ దెబ్బకు ‘పెళ్లిచూపులు’ మందు రాస్తోంది

By:  Tupaki Desk   |   2 Aug 2016 5:30 PM GMT
ఆ దెబ్బకు ‘పెళ్లిచూపులు’ మందు రాస్తోంది
X
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ భారీ సినిమా తీవ్రంగా నిరాశ పరిచినపుడు జనాలు ఒకరకమైన ఫ్రస్టేషన్లో ఉంటారు. అలాంటి టైంలో మంచి సినిమా పడితే దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ సినిమా అంచనాల్ని మించి విజయం సాధిస్తుంది. ఇందుకు ‘బిచ్చగాడు’ - ‘అఆ’ లాంటి సినిమాలే ఉదాహరణ. విడుదలైనపుడు అసలెవ్వరికీ పట్టని ‘బిచ్చగాడు’.. ‘బ్రహ్మోత్సవం’ పుణ్యమా అని ఉన్నట్లుండి జనాల్లోకి వెళ్లిపోయింది. ‘బ్రహ్మోత్సవం’ హ్యాంగోవర్‌ పోగొట్టుకోవడానికి జనాలు ‘బిచ్చగాడు’ చూశారు. ఆ తర్వాత ‘అఆ’ కూడా జనాలకు ఉపశమనాన్నిస్తూ కలెక్షన్ల వర్షం కురిపించుకుంది.

లేటెస్టుగా జనాలు ‘కబాలి’ కొట్టిన దెబ్బకు విలవిలలాడిపోయి ఉన్నారు. విడుదలకు ముందు ఆ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన స్టార్ల సినిమాలకు కూడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో హైప్ వచ్చింది ఈ సినిమాకు. కానీ ఆ హైప్ అంతా విడుదలయ్యాక ఉఫ్ అని ఎగిరిపోయింది. మాంచి ఎంటర్టైన్ అవుతుందనుకున్న ‘కబాలి’ తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆ సినిమా కొట్టిన దెబ్బకు ఇప్పుడు ‘పెళ్లిచూపులు’ మందు రాస్తోంది. ఈ సినిమా అంచనాల్ని మించి ఆడుతుండటానికి జనాల్లో ఉన్న ‘కబాలి’ ఫ్రస్టేషన్ కూడా ఓ కారణం. ఆ దెబ్బ నుంచి ‘పెళ్లిచూపులు’ ఉపశమనాన్ని ఇస్తోంది. తొలి వారాంతం అంతా అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడం వల్ల భారీగా కలెక్షన్లు సాధించిన ‘కబాలి’ వీకెండ్ అవ్వగానే డల్లయిపోయింది. రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. అదే సమయంలో ‘పెళ్లిచూపులు’ హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది.