Begin typing your search above and press return to search.

పెళ్లిచూపులు రీమేక్.. ప్రేమమ్ కనెక్షన్

By:  Tupaki Desk   |   26 Nov 2016 10:24 AM GMT
పెళ్లిచూపులు రీమేక్.. ప్రేమమ్ కనెక్షన్
X
ఈ ఏడాది తెలుగు సినిమాల్లో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే పెళ్లిచూపులు మూవీనే. విడుదలకు నెల రోజుల ముందు వరకు ఇలాంటి సినిమా ఒకటి తెలుగులో తీశారన్న సంగతే తెలియదు. కానీ విడుదలకు ముందే ఈ సినిమాకు అనూహ్యంగా పాజిటివ్ బజ్ వచ్చింది. విడుదల తర్వాత అంచనాల్ని మించిపోయి సూపర్ హిట్ అయిందీ సినిమా. వెంటనే పొరుగు భాషల నుంచి రీమేక్ హక్కుల కోసం పోటీ కూడా మొదలైంది. ఆల్రెడీ కన్నడలో ‘పెళ్లి చూపులు’ రీమేక్ కోసం సన్నాహాలు మొదలైపోయాయి. హీరో హీరోయిన్లు.. దర్శకుడు ఫిక్సయిపోయారు. సినిమా కూడా మొదలైపోతోంది. మరోవైపు తమిళంలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ‘పెళ్లిచూపులు’ రీమేక్ హక్కులు తీసుకోవడం విశేషం.

తమిళంతో పాటు మలయాళంలో ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ నిర్మాతగా మాత్రమే ఉంటాడా.. దర్శకత్వం కూడా చేస్తాడా అన్నది క్లారిటీ లేదు. ఐతే ఈ చిత్రం కోసం ‘ప్రేమమ్’ మీరో నివిన్ పౌలీని అడుగుతున్నాడట గౌతమ్. నివిన్ అయితే హీరో పాత్ర మరింతగా పండుతుందని.. సినిమా రేంజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నాడు గౌతమ్. నివిన్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. నివిన్ ఇంతకుముందు తమిళంలో నేరమ్ (తెలుగులో రన్) అనే సినిమా చేశాడు. దీంతో పాటు ‘ప్రేమమ్’ కూడా తమిళనాట ఇరగాడింది. అతణ్ని హీరోగా పెట్టుకుంటే తమిళం.. మలయాళ భాషల్లో ఒకేసారి సినిమాను లాగించేయొచ్చు. ‘పెళ్లిచూపులు’ అతడికి బాగా సూటయ్యే సినిమా కూడా.