Begin typing your search above and press return to search.

ఫెయిలయిన బాలీవుడ్ పెళ్ళిచూపులు

By:  Tupaki Desk   |   16 Sep 2018 12:30 PM GMT
ఫెయిలయిన బాలీవుడ్ పెళ్ళిచూపులు
X
ఒక సినిమా ఒక భాషలో సూపర్ హిట్ అయితే ఇతర భాషల ఫిలింమేకర్స్ వారి బాషల్లోకి రీమేక్ చేయడం అనేది సాధారణంగా జరిగేదే. దాదాపు మెజారిటీ రీమేక్స్ హిట్ అవుతాయిగానీ అన్నీ రీమేకులు హిట్ కావాలని రూలేం లేదు. ఇప్పుడు 'పెళ్ళి చూపులు' హిందీ రీమేక్ 'మిత్రోన్' కూడా హిట్ కాని రీమేకుల లిస్టు లో చేరింది.

విజయ్ దేవరకొండ - రితు వర్మ హీరో హీరోయిన్లు గా నటించిన 'పెళ్ళిచూపులు' సినిమాకు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకుడు. 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ అయ్యి విజయ్ దేవరకొండ కు మొదటి హిట్ గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో జాకీ భగ్నాని - కృతిక కమ్రా లు హీరో హీరోయిన్లు గా 'మిత్రోన్' పేరుతో తెరకెక్కింది. నితిన్ కక్కర్ దర్శకుడు. ఈ శుక్రవారమే ఈ 'మిత్రోన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ రెస్పాన్స్ మాత్రం చాలా వీక్ గా ఉంది. ప్లాట్ వీక్ గా ఉందని.. కామెడీ పండలేదని రివ్యూయర్లు - క్రిటిక్స్ పెదవి విరిచారు.

మొదటి రోజు కలెక్షన్స్ రూ. 50 లక్షల నెట్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఇక శనివారం రోజు కలెక్షన్స్ లో ఎలాంటి ఇంప్రూవ్ మెంట్ లేదు. ఇక ఈ సినిమా అటకెక్కినట్టే! విజయ్ దేవరకొండకు ఫస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా హిందీలో బోల్తా కొట్టడం కాస్త నిరాశ కలిగించేదే. మరోవైపు ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ గౌతమ్ మీనన్ దగ్గర ఉన్నాయి. మరి తమిళ పెళ్ళి చూపులు ఎమౌతాయో వేచి చూడాలి.