Begin typing your search above and press return to search.

హాఫ్‌ మిలియన్ గ్యారంటీ అంటున్నారే

By:  Tupaki Desk   |   2 Aug 2016 1:30 PM GMT
హాఫ్‌ మిలియన్ గ్యారంటీ అంటున్నారే
X
గత శుక్రవారం విడుదలైన చిన్న సినిమా పెళ్లి చూపులు.. పెద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ఉండడంతో అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చిన్న సినిమా హంగామా నడుస్తున్న టైమ్ లో.. ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పెళ్లి చూపులు ఇరగదీస్తోంది. మొదటి వీకెండ్ చివరకే 294,000 డాలర్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. రెండో వారాంతం నాటికి ఖచ్చితంగా హాఫ్ మిలియన్ మార్క్ టచ్ చేయడం ఖాయం అంటున్నారు. ఈ లోబడ్జెట్ మూవీకి హాఫ్ మిలియన్ అనే మార్క్ చాలా చాలా పెద్దది. ఎందుకంటే.. పెళ్లి చూపులు బడ్జెట్ దాదాపు ఇదే మొత్తానికి సమానం. పాజిటివ్ మౌత్ టాక్ తో పాటు.. డిఫరెంట్ గా ఉందనే రివ్యూలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

ఎక్కడా బోర్ కొట్టించని నెరేషన్ తో పాటు సినిమా హీరో హీరోయిన్ల యాక్టింగ్ ఈ మూవీకి ప్రధానమైన హైలైట్. సురేష్ బాబు సమర్పణ పెళ్లి చూపులపై ఆసక్తి కలిగించగా.. రాజమౌళి ఈ సినిమా చేసిన కామెంట్స్ కలెక్షన్స్ స్టడీగా కొనసాగడానికి ఉపయోగపడ్డాయి.