Begin typing your search above and press return to search.
'పెద్దన్న' ట్రైలర్: దీపావళికి థియేటర్లలో రజినీ మాస్ జాతర ఖాయం..!
By: Tupaki Desk | 27 Oct 2021 7:56 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'అన్నాత్తే'. మాస్ డైరెక్టర్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ''పెద్దన్న'' పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. రజినీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.
'నువ్వు ఎవరనేది నువ్ వెనకేసుకున్న ఆస్తిలోనో.. నీ చుట్టూ ఉన్నవాళ్లకి నీ మీదున్న భయంలోనో లేదు.. నువ్వు చేసే చర్యల్లోనూ మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది.. ఇది వేదవాక్కు' అని రజినీ చెప్పే డైలాగ్ తో 'పెద్దన్న' ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో చుట్టుపక్కల గ్రామాలకు పంచాయతీ పెద్దగా.. వీరన్నగా రజినీ కనిపిస్తున్నారు. ఆయన చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. సూపర్ స్టార్ అభిమానులు కోరుకునే యాక్షన్, కామెడీ ఎమోషన్స్.. ఇలా అన్ని అంశాలు కలబోసి ఈ గ్రామీణ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించినట్టు అర్థమవుతుంది.
రజనీకాంత్ కు జోడీగా నయనతార కనిపించగా.. సీనియర్ నటీమణులు మీనా - ఖుష్బూ ఆయన మరదళ్లుగా ప్రత్యేక ఆకర్షణగా మెరిసారు. 'జీవితంలో ఎంతో మంది శత్రువులను చూసాను.. మొట్ట మొదటిసారి నాచేత కన్నీళ్లు చిందించిన శత్రువు నువ్వు.. నిన్ను అంతం చేయడం బాధ్యత కాదు.. నా హక్కు' అనే డైలాగ్ తో ప్రతినాయకుడు జగపతిబాబు పాత్ర ఎలా ఉండబోతుందో అర్తం అవుతోంది. ఇందులో ప్రకాష్ రాజ్ - అభిమన్యు సింగ్ విలన్ రోల్స్ చేశారు. సూరి - సతీష్ తమ కామెడీతో నవ్వించే బాధ్యత తీసుకున్నారు.
సోదరిని అమితంగా ఇష్టపడే పెద్దన్న.. ఆమెకు కష్టమొస్తే అండగా ఎంత దూరం వెళ్ళాడు? ఏం చేసి ఆమెను రక్షించుకున్నాడు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ దర్శకుడు శివ గత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. రజనీకాంత్ స్టైల్ - మేనరిజం - సంభాషణలు మెప్పిస్తున్నాయి. 'న్యాయంగానూ ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే.. ఆ దేవుడే దిగివచ్చి తనకు తోడుగా ఉంటాడు' అనే డైలాగ్ బాగుంది.
'పెద్దన్న' ట్రైలర్ లో డి.ఇమ్మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ - కెమెరామెన్ వెట్రి పలనిస్వామి అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రూబెన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేయగా.. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ కంపోజ్ చేశారు. మిలన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మొత్తం మీద ఈ హై వోల్టేజ్ ట్రైలర్ చూస్తుంటే దీపావళికి థియేటర్లలో భారీ కమర్షియల్ హంగామా చూడబోతున్నామని తెలుస్తోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తెలుగులో 'పెద్దన్న' సినిమాని ఏషియన్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి రిలీజ్ చేస్తున్నారు.