Begin typing your search above and press return to search.

బ్యూటిఫుల్ హీరోయిన్ సెక్సీ వేషాలు

By:  Tupaki Desk   |   16 March 2016 5:30 PM GMT
బ్యూటిఫుల్ హీరోయిన్ సెక్సీ  వేషాలు
X
చూడ‌గానే బ్యూటిఫుల్ అనిపించే ఆహ్లాద‌క‌ర‌మైన అందం కీర్తి సురేష్ సొంతం. అందుకే మాతృభాష మ‌ల‌యాళంలోనే కాక‌.. త‌మిళం - తెలుగు భాష‌ల్లోనూ అభిమానుల్ని సంపాదించుకుంది కీర్తి. తెలుగులో అయితే ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో కొలువైపోయింది. ‘నేను శైల‌జ’ విజ‌య‌వంత‌మ‌వ్వ‌డానికి కీర్తి కూడా ముఖ్య కార‌ణం. ఐతే ఆ సినిమా అమ్మ‌డికి పెద్ద‌గా అవ‌కాశాలు మాత్రం తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. ఎక్స్ పోజింగ్ చేయ‌ను అని ఖ‌రాఖండిగా చెప్పేయ‌డ‌మే దీనికి కార‌ణం అన్న అభిప్రాయాలు వినిపించాయి. కీర్తికి కొన్ని అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోవ‌డం ఈ అభిప్రాయానికి బ‌లం చేకూర్చింది.

ఈ మాట‌లు కీర్తి వ‌ర‌కూ చేరిన‌ట్లున్నాయి. జ‌నాల‌కు ఓ స్వీట్ షాక్ ఇద్దామ‌ని ఓ సెక్సీ ఫొటో షూట్ కు తెర లేపింది మ‌ల‌యాళ కుట్టి. ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ సాయంతో ఓ ఫొటో షూట్ చేసి.. ఆ ఫొటోల‌ను మీడియాకు రిలీజ్ చేసింది కీర్తి. డార్క్ లైటింగ్ లో కీర్తి సెక్సీ మూడ్లో ఉండ‌గా తీసిన ఈ ఫొటోలు.. కుర్రాళ్ల‌కు కాక పుట్టించేస్తాయ‌ని అనుక‌న్న‌ట్లున్నారు. ఐతే ఆ ఫొటోలు అలాంటి రొమాంటిక్ ఫీలింగ్ ఏమీ ఇవ్వ‌ట్లేదు. స‌న్నీ లియోన్ చీర క‌డితే ఎలా ఎబ్బెట్టుగా ఉంటుందో.. అలా ఉన్నాయి కీర్తి సెక్సీ వేషాలు. ఈ టైపు ఫొటో షూట్లు కీర్తికి అస్స‌లు సూట‌వ్వ‌వ‌ని ఈ ఫొటోలు చూస్తే అర్థ‌మ‌యిపోతుంది. కాబ‌ట్టి ఎవ‌రికి ఏది సూట‌వుతుందో అది చేసుకుంటే బెట‌ర్ అన్న స‌త్యాన్ని కీర్తి గ్ర‌హిస్తే బెట‌రేమో.