Begin typing your search above and press return to search.
ఆస్కార్ బరిలో నిలిచాం అంటూ గర్వంగా పీసీ
By: Tupaki Desk | 16 March 2021 10:59 PM ISTతన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఈ రోజు ఆస్కార్ 2021 నామినేషన్లను ప్రకటించిన ప్రియాంక చోప్రా గర్వంతో ఉప్పొంగిపోయారు. పీసీ నటించిన 2021 చిత్రం `ది వైట్ టైగర్` ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైంది. నామినేషన్ లో తన సినిమా పేరును ప్రకటించినందున ఆమె ఆనందానికి అవధులే లేవు. గర్వంతో ఉప్పొంగింది.
ఈ చిత్రంలో నటించిన ఆదర్ష్ గౌరవ్ తన అద్భుత నటనకు ఇటీవలే బాఫ్టా నామినేషన్ అందుకున్నారు. రాజ్ కుమార్ రావు ఇందులో ఒక కీలక పాత్రధారి. రామిన్ బహ్రానీ దర్శకత్వంలో నిర్మాతలు ముకుల్ డియోరా - అవ డువెర్నాయ్ లతో కలిసి ప్రియాంక చోప్రా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించారు. నామినేషన్లు ప్రకటించిన అనంతరం ప్రియాంక తన ఉత్సాహాన్ని ఒక ట్వీట్ లో వెల్లడిస్తూ... ``మనం ఆస్కార్ కు నామినేట్ అయ్యాం! రామిన్ అండ్ టీమ్ కి అభినందనలు.. ఏదో ఒక విధంగా నామినేషన్ లో చేరడం చాలా ప్రత్యేకమైనది. చాలా గర్వించదగ్గ సందర్భమిది`` అని పీసీ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తూ నాటి ఆన్ సెట్స్ BTS చిత్రాలను పంచుకున్నారు. ఇప్పటికే బాఫ్టా నామినేషన్ కి వెళ్లిన నటుడు ఆదర్శ్ గౌరవ్ మరింతగా ఎమోషనల్ అయ్యారు. ఆయన ఈ చిత్రంలో తన నటనకు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు. తన దర్శకుడు రామిన్ బహ్రానీ ఒక లెజెండ్! అంటూ ప్రశంసలు కురిపించారు ఆదర్శ్.
వైట్ టైగర్ చిత్రం అరవింద్ అడిగా బెస్ట్ సెల్లింగ్ బుక్ `వైట్ టైగర్ ఆధారంగా రూపొందింది. పుస్తకం నుండే మూవీకి స్క్రీన్ ప్లేని కూడా స్వీకరించారు. ఈ పుస్తకం 2008 లో బుకర్ బహుమతిని అందుకుంది.
అకాడమీ అవార్డ్స్ 2021 బరిలో ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఇతర నామినేషన్లలో పోటీపడుతున్నవి ఆషామాషీవేం కాదు. ఫ్లోరియన్ జెల్లర్స్ -ఫాదర్.. క్లోస్ జావోస్ నోమాడ్ లాండ్ .. రెజీనా కింగ్ దర్శకత్వం వహించిన వన్ నైట్ ఇన్ మయామి ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులు ఏప్రిల్ 25 న (భారతదేశ కాలమానం ప్రకారం ఏప్రిల్ 26) జరగనున్నాయి.