Begin typing your search above and press return to search.

చీర్ లీడ‌ర్ గా మారి ఆయ‌న‌లో ఊపు తెస్తోంది!

By:  Tupaki Desk   |   6 April 2022 2:30 AM GMT
చీర్ లీడ‌ర్ గా మారి ఆయ‌న‌లో ఊపు తెస్తోంది!
X
అన్యోన్య దాంప‌త్యం అనే ప‌దానికి కేరాఫ్ అడ్రెస్ గా మారారు ప్రియానిక్ జంట‌. ప్రేమించి పెళ్లాడాక నిక్ త‌న భార్య‌ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారంటే అతిశ‌యోక్తి కాదు. పీసీ లేని క్ష‌ణాన్ని నిక్ ఊహించుకోలేడు. ఆయ‌న లేని క్ష‌ణాల‌ను ప్రియాంక చోప్రా అస్స‌లు ఇమాజిన్ చేయ‌లేదు. అంత‌గా ఈ జంట సంసారం ముచ్చ‌ట‌గా సాగుతోంది. ప‌లు అంత‌ర్జాతీయ‌ మీడియా సంస్థ‌లు ఈ జంట విడిపోతున్నారంటూ త‌ప్పుడు క‌థ‌నాల‌తో త‌ప్పు దారి ప‌ట్టించాల‌ని చూసినా పీసీ-నిక్ దానికి ఎంత‌మాత్రం స్కోప్ ఇవ్వ‌లేదు. ప్ర‌తిదానికి త‌మ‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చారు. ఈ ముచ్చ‌టైన జంట‌ ఇటీవ‌లే స‌రోగ‌సీలో ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఓవైపు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ని మ‌రోవైపు దాంప‌త్య జీవ‌నాన్ని బ్యాలెన్స్ చేస్తూ జంట‌ల‌కు గోల్స్ సెట్ చేస్తున్నారు ఈ అంద‌మైన జోడీ. తాజాగా ప్రియాంక చోప్రా బేస్ బాల్ గేమ్ లో భర్త నిక్ జోనాస్ కు చీర్ లీడర్ గా మారింది. భ‌ర్త నిక్ ఆడుతున్న బేస్ బాల్ గేమ్ నుండి చిత్రాలను షేర్ చేస్తూ ప్రియాంక పోస్ట్ కి ``గేమ్ డే #పర్ఫెక్ట్‌సండే #హ్యాపీవల్లిస్`` అని క్యాప్షన్ ఇచ్చింది. మొదటి పోస్ట్ లో.. నిక్ షాట్ కొట్టేటప్పుడు బేస్ బాల్ యూనిఫాం ధరించి కనిపించాడు. తర్వాతి పోస్ట్ లో నటి ఎరుపు రంగు లాంగ్ ప్యాంట్ లో కంచెపై ఆనుకుని పొడవాటి భారీ స్కై బ్లూ జెర్సీతో అందంగా కనిపిస్తోంది. మూడవ పోస్ట్ లో ప్రియాంక చోప్రా కెమెరాకు పోజులిస్తుండగా ఆమె కజిన్ దివ్య జ్యోతి కూతురు ఫోటో క్లిక్ చేస్తోంది. తదుపరి చిత్రంలో నిక్ తన బృందంతో పోజులిచ్చాడు. చివరి ఫోటోలో ప్రియాంక తన పేరు- నంబర్ 2 అని రాసిన జెర్సీని ధరించి క‌నిపించింది.

ఇటీవల నిక్ జోనాస్ - ప్రియాంక చోప్రా లాస్ ఏంజిల్స్ లో లంచ్ డేట్ లో కనిపించిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో అవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. జనవరిలో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డ జ‌న్మించింద‌న్న క‌బురును అందించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత పీసీ నుంచి సామాజిక మాధ్యమాల్లోకి వ‌చ్చిన ఫోటోలు ఇవి. ప్రియానిక్ ఇంకా తమ బిడ్డ లింగాన్ని కానీ పేరును కానీ రివీల్ చేయ‌లేదు. అయితే, ఈ జంట ఒక పండంటి అమ్మాయిని స్వాగతించార‌ని ప్రియాంక కజిన్ మీరా చోప్రా వెల్లడించారు.

ఇంత‌కుముందు ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ తమ లంచ్ డేట్ తర్వాత ఒక కిస్ ఈమోజీని షేర్ చేయ‌గా...``మీ కూతురిని ఎప్పుడు చూడబోతున్నాం? అని అభిమానులు ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిన్న అమ్మాయితో కలిసి నడుస్తున్న చిత్రాన్ని కూడా షేర్ చేసింది. అది వైర‌ల్ గా మారింది. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా ఓ లైవ్ సెషన్ లో మాట్లాడుతూ.. ఆమె తన మనవడిని కలవలేదని వెల్లడించింది. అలాగే ప్రియాంక మరియు నిక్ త్వరలో భారతదేశానికి రావచ్చని తన అభిమానులకు తెలియజేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రియాంక చోప్రా ప‌లు భారీ చిత్రాల‌తో బిజీగా ఉంది. సిటాడెల్- ఎండింగ్ థింగ్స్- టెక్స్ట్ ఫర్ యు- ఫర్హాన్ అక్తర్ జీ లే జరా వంటి అనేక ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.