Begin typing your search above and press return to search.

ఫలక్ నుమా దాస్ ఫస్ట్ సింగిల్.. కిరాక్!

By:  Tupaki Desk   |   19 Feb 2019 10:52 PM IST
ఫలక్ నుమా దాస్ ఫస్ట్ సింగిల్.. కిరాక్!
X
విష్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ.. నిర్మించిన 'ఫలక్ నుమా దాస్' ట్రైలర్ ఈమధ్యే రిలీజ్ అయి అందరినీ ఒకసారి షాక్ కు గురిచేసింది. విచ్చలవిడిగా వాడిన బూతులపై సంప్రదాయ వాదులు విమర్శలు చేసినప్పటికీ ఓల్డ్ సిటీ నేటివిటీని రియల్ ఫీల్ తో చూపించడంతో చాలామంది విష్వక్ సేన్ ను ప్రశంశిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.

'పెళ్ళిచూపులు'.. 'ఈ నగరానికి ఏమైంది'.. 'సమ్మోహనం' లాంటి సినిమాలకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. పాయె పాయె అంటూ సాగే ఈ మాస్ పాటకు సాహిత్యం అందించిన వారు నేషనల్ అవార్డు విన్నర్ సుద్దాల అశోక్ తేజ. అతి సులువైన పదాలతో అయన మ్యాజిక్ చేసేశారు. ఈ సరదా పాటను పాయె పాయె అంటూ రెచ్చిపోయి పాడిన వారు రాహుల్ సిప్లిగంజ్.. శివ నాగులు. రెండు మూడు సార్లు వింటే మీరు కూడా పాయె పాయె అంటూ పాడడం ఖాయం.

ట్రైలర్ తో మెప్పించ్చిన 'ఫలక్ నుమా దాస్' ఫస్ట్ సింగిల్ కూడా మంచి మార్కులే తెచ్చుకుంది. ఇంకా ఆలస్యం ఎందుకు.. పాట వినండి.. లిరిక్స్ చూడండి.. పాయె పాయె అంటూ పాడుకోండి. ట్రైలర్ లో అంటే బూతు.. బూతు అన్నారు కానీ ఇందులో బూతులు లేవు.. ఎంజాయ్ ఫ్రెండ్స్!