Begin typing your search above and press return to search.
#కరోనా.. విమానాశ్రయాల్లో సెలబ్ న్యూట్రెండ్
By: Tupaki Desk | 5 March 2020 10:27 AM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ ఒణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా వరల్డ్ వైడ్ గా విస్తరిస్తోంది. సుమారు 1500 మంది దీని బారిన పడి కన్నుమూశారు. దాదాపు వరల్డ్ వైడ్‌గా 90వేల మంది కరోనా వైరస్‌కి గురి కాగా.. అందులో 80వేల మంది చైనాలోనే ఉన్నారని ఇటీవల లెక్కలు వెల్లడించాయి. మన ఇండియాలోనూ కరోనా ఛాయలు కనిపించాయి. 27 మందికి కరోనా అనుమానితులుగా ప్రకటించగా.. ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు ఇటీవల భారత వైద్య శాఖ వెల్లడించింది. అనుమానితుల జాబితాలో తెలంగాణ వాసి పేరు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వైరస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దీనికి సంబంధించి పలు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను కూడా కేటాయించారు. తక్షణంగా వంద కోట్ల ఫండ్‌ని ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు దీనిపై ప్రజల్లో అవేర్ నెస్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వం ఎంత చేసినా తారలు స్పందిస్తే అది జనంలోని త్వరగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.
పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే కరోనాపై ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలని మాస్క్ లు ధరించి అలెర్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ ఎవరూ ఇంకా దీనిపై మాట్లాడకపోయినా.. నెమ్మదిగా ఒకరొకరుగా ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం కరోనాకి భయపడకుండా యూరప్ వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ వెళుతూ మాస్క్ ధరించి విమానాశ్రయంలో కనిపించారు. ఇది కొంతవరకూ ధైర్యాన్నిచ్చే విషయమేనని ప్రశంసలు దక్కాయి. ఇక ఇతర స్టార్లంతా షూటింగులకు రెడీ అవుతున్నారు కాబట్టి మాస్క్ లతో విమానాశ్రయాల్లో కనిపిస్తారనడంలో సందేహం లేదు. ఇదే విధంగా కొత్తందం పాయల్ మాత్రం తన వంతు సామాజిక బాధ్యతని నెరవేరుస్తోంది. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని అప్రమత్తం చేయడమే గాకుండా మాస్క్ ఎలా ధరించాలో ప్రాక్టికల్ గానే చూపించింది. పాయల్ లోని ఈ సామాజిక బాధ్యత యాంగిల్ కి ఆమె అభిమానులు శభాష్ అంటున్నారు.
కేవలం పాయల్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలంతా విమాన ప్రయాణాల వేళ ఇలా మాస్క్ ధరించి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుండడం కొత్త ట్రెండ్ అనే చెప్పాలి. పలువురు టాలీవుడ్ స్టార్లతో పాటు బాలీవుడ్ కోలీవుడ్ స్టార్లు విమానాశ్రయాల్లో మాస్క్ లు ధరించి జనాల్ని అలెర్ట్ చేస్తుండడం ఆసక్తికరం. స్టార్లు సామాజిక బాధ్యత తో వ్యవహరించడం ఇలాంటప్పుడు చాలా అవసరం. ఆ పని చేసిన పాయల్ ని అభినందించాలి.