Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : కష్టపడి 5 కేజీలు తగ్గిన బోల్డ్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   23 Oct 2020 12:10 PM GMT
క్లిక్‌ క్లిక్‌ : కష్టపడి 5 కేజీలు తగ్గిన బోల్డ్‌ బ్యూటీ
X
ఆర్‌ ఎక్స్‌ 100 సినిమాలో కాస్త బోల్డ్‌ గా కనిపించి నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. స్టార్స్‌ మూవీలో కాకున్నా ఒక మోస్తరు హీరోల సినిమాల్లో హీరోయిన్‌ గా.. ఐటెం సాంగ్స్ లో చేస్తూ వస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తోంది. ఈ లాక్‌ డౌన్‌ టైం లో ఈమె షూటింగ్‌ లేకపోవడంతో ఖాళీగా కూర్చని తినడంతో బరువు పెరిగినట్లుంది. అందుకే ఈమె బరువు తగ్గే పని పెట్టుకుంది.

కొన్ని రోజుల క్రితం బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొని ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసిన ఈ అమ్మడు తాజాగా అన్నట్లుగానే వెయిట్‌ తగ్గాను అంది. అయితే తగ్గిన బరువు పూర్తి సంతృప్తి ఇవ్వకున్నా ఎంతో కొంత తగ్గాను అనే సంతృప్తి మాత్రం దక్కిందంటూ చెప్పుకొచ్చింది. 63 కేజీలు ఉన్న తాను ప్రస్తుతం 58 కేజీలకు తగ్గినట్లుగా చెప్పింది. హీరోయిన్స్‌ 50 నుండి 55 కేజీల వరకు ఉంటే బెటర్‌. వారి హైట్‌ ను బట్టి వెయిట్‌ చూసుకోవాల్సి ఉంటుంది. పాయల్‌ 55 కు కాస్త తక్కువ అవ్వాలని కోరుకుందట. కాని 58 వద్ద ఉండి పోయింది. ఇంకా కష్టపడి తగ్గుతుందేమో చూడాలి.