Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆర్ ఎక్స్ బ్యూటీ విర‌సం

By:  Tupaki Desk   |   27 Dec 2018 2:36 PM GMT
ఫోటో స్టోరి: ఆర్ ఎక్స్ బ్యూటీ విర‌సం
X
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు

విరహాల గోల ఇంకానా వీలు కాదు ..

వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు

చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు

విరజాజి పూలు వంటిట్లో వాడరాదు..

శివ (1990) సినిమాలో మనో - జానకి పాడిన ఈ పాట ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేం. ఇళయరాజా స్వ‌ర‌ప‌రిచిన ఆ పాట‌లోని గ‌మ‌కాలు ఎంతో గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాట‌ను ర‌చించారు. అయితే ఈ పాటలో నాగార్జున‌- అమ‌ల అభిన‌యం అభిమ‌నుల క‌ళ్ల‌లోనే మెదులుతుంటుంది.

ఈ పాట‌ను ఈ సందర్భంలో నే గుర్తు చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక‌ కార‌ణం ఉంది. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ నీర‌జాక్షి అంతే అందంగా కుర్ర‌కారు త‌ల‌పుల్లో లాక్ అయ్యింది. అనునిత్యం సామాజిక మాధ్య‌మాల్లో కొత్త ఫోటోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ కి కంటిమీద కునుకు ప‌ట్ట‌నీకుండా చేస్తోంది. అంతగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని ఈ బ్యూటీ పాయ‌ల్. ఆర్‌.ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన పాయ‌ల్ రాజ్‌ పుత్‌ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ కుర్ర‌కారుకు పిచ్చిగా న‌చ్చేసింది. అందుకే ఈ భామ ఒక‌దాని వెంట ఒక‌టిగా భారీ చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. త‌దుప‌రి మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌రస‌న ఓ బంప‌రాఫ‌ర్ అందుకుంది. ఈ చిత్రానికి విఐ ఆనంద్ ద‌ర్శ‌కుడు. అలాగే వేరొక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇదివ‌ర‌కూ సంత‌కం చేసింద‌న్న ప్ర‌చారం సాగింది. మ‌రోవైపు పంజాబీలోనూ పాయ‌ల్ బిజీ స్టార్.