Begin typing your search above and press return to search.

మన్మధుడితో కాదు మామతో రొమాన్స్‌..?

By:  Tupaki Desk   |   20 Feb 2019 8:16 AM GMT
మన్మధుడితో కాదు మామతో రొమాన్స్‌..?
X
ఆర్‌ ఎక్స్‌ 100' బ్యూటీ పాయల్‌ రాజ్‌ పూత్‌ మంచి ఆఫర్ల కోసం అంటూ టైం అంతా కూడా వృదా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మొదటి సినిమాతోనే అందం పరంగా, అభినయం పరంగా మంచి మార్కులు అయితే దక్కించుకున్న ఈ అమ్మడు ఇప్పటి వరకు ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్రను చేసి ప్రేక్షకుల ముందుకు రాలేదు. మంచి ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ చెబుతూ వస్తోంది. తాజాగా అమ్మడు నాగార్జున నటించబోతున్న మన్మధుడు 2 చిత్రంలో ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లే అంటూ ఆమె స్వయంగా పేర్కొంది. మన్మధుడు 2 చిత్రం కోసం తనను ఎవరు సంప్రదించలేదంది.

మన్మధుడు 2 చిత్రంలో పాయల్‌ లేదని దాదాపుగా క్లారిటీ వచ్చింది. ఈ సమయంలోనే వెంకీ మామ చిత్రంలో పాయల్‌ రాజ్‌ పూత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం మొదలైంది. వెంకటేష్‌ - నాగచైతన్య కలిసి నటించబోతున్న ఈ మల్టీస్టారర్‌ మూవీలో ఇప్పటికే శ్రియ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చాయి. కాని శ్రియ కాకుండా వెంకీకి జోడీగా ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌ ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

'వెంకీ మామ' చిత్రాన్ని జైలవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో సురేష్‌ బాబు నిర్మిస్తున్నాడు. ఈ వారంలో షూటింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో మంది పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు పాయల్‌ రాజ్‌ పూత్‌ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. షూటింగ్‌ ప్రారంభం సందర్బంగా హీరోయిన్స్‌ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.