Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : అమ్మడు ఈ అడ్డదారి ప్రమోషన్ ఏంటీ?
By: Tupaki Desk | 12 Nov 2020 10:30 AM ISTసినిమా స్టార్స్ విస్కీ ప్రమోషన్ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కొత్త మార్గంను అనుసరిస్తున్నారు. ఈమద్య కాలంలో చాలా మంది హీరోలు మరియు హీరోయిన్స్ తో విస్కీ కంపెనీలు కొన్ని సోషల్ మీడియాలో పర్సనల్ పోస్ట్ లు పెట్టిస్తున్నాయి. టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు హీరోయిన్స్ విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ పర్సనల్ ఫొటోల మాదిరిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమద్య హీరోయిన్ పూజా హెగ్డే తన తండ్రితో కలిసి రెడ్ లెబుల్ విస్కీ బ్రాండ్ కు ఫొటో ఫోజ్ ఇచ్చింది.
ఇప్పటి వరకు స్టార్స్ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో విస్కీ బ్రాండ్ తీసుకుంటున్నట్లుగా ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వారు ఖచ్చితంగా ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేసినా కూడా స్నేహితులతో జస్ట్ చిల్ అవుతున్నాం అంటూ వివరణ ఇచ్చుకునేలా ఉన్నాయి. అయితే పాయల్ షేర్ చేసిన ఫొటో మాత్రం రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ ను ప్రమోట్ చేసినట్లుగానే ఉంది. సింగిల్ గా ఆమె గ్లాస్ పట్టుకున ఫొటోకు ఫోజ్ ఇచ్చినట్లుగా ఉంది.
ఇలాంటి పబ్లిసిటీ ఎంత వరకు కరెక్ట్ అంటూ నెటిజన్స్ పాయల్ ను విమర్శిస్తున్నారు. హీరోయిన్ గా బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు అయిన పాయల్ ఇలా ప్రమోషన్ కోసం అడ్డదారి అనుసరించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. వారు ఒక్క పోస్ట్ తో ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడి విస్కీకి ప్రమోషన్ చేయడం ఎంత వరకు సెలబ్రెటీలకు న్యాయం అనిపిస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.