Begin typing your search above and press return to search.

ఆర్‌.ఎక్స్ బ్యూటీ అణు విస్పోట‌నం

By:  Tupaki Desk   |   8 Oct 2018 4:31 PM GMT
ఆర్‌.ఎక్స్ బ్యూటీ అణు విస్పోట‌నం
X
న‌టించిన తొలి సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో అణు విస్పోట‌నం అయ్యింది. 100 సీసీ ఆర్‌.ఎక్స్ బైక్ మీద 500 సీసీ పిక‌ప్ ఉన్న కుర్రాడితో ఓ రేంజులో షికార్లు చేసింది. అస‌లు హీరో కార్తికేయ‌లోని ఆ సీసీ ప‌వ‌ర్ ఈ అమ్మ‌డికి ఏమాత్రం స‌రిపోలేద‌ని యూత్ అంతా తెగ ఇదైపోయారు. 1000 సీసీ బుల్లెట్టులా ఏమాత్రం తొణికిస లాట అన్న‌దే లేకుండా చెల‌రేగి రొమాన్స్ చేసిన తీరు - పెద‌వి ముద్దులు - బెడ్‌ రూమ్ స‌న్నివేశాల్లో న‌టించిన తీరు చూసి ప‌రేషాన్ అయిపోయిండ్రు.

ఒక‌టో సినిమాతోనే అంత పికప్‌ని మ్యానేజ్ చేసిన ఈ అంద‌గ‌త్తెకు టాలీవుడ్‌ లో పెద్ద స్టార్ అయ్యే యోగం ప్రాప్తించిన‌ట్టేన‌ని భావిస్తున్నారంతా. ప్ర‌స్తుతం `మిస్ట‌ర్ అండ్ మిసెస్ 420 రిట‌ర్న్స్` అనే పంజాబీ చిత్రంలో న‌టిస్తున్న‌ ఈ అందాల సుగుణ‌రాశి టాలీవుడ్‌ లో భాను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి క‌మిట‌య్యాన‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించింది. ఆ చిత్రంలో ఆర్‌.ఎక్స్ కంటెంట్‌ కి పూర్తి భిన్న‌మైన కథ‌లో న‌టించ‌బోతున్నాన‌ని - త‌న పాత్ర బోల్డ్ గా గూండాగిరీ టైప్‌ లో ఉంటుంద‌ని క్లూ ఇచ్చింది.

తాజాగా అదిరిపోయే ఫోటోషూట్‌ తో మ‌రోసారి సామాజిక మాధ్య‌మాల్లో వాడి వేడి చ‌ర్చ‌కు తావిచ్చింది. పాల నురుగు దేహ‌శిరుల్ని క‌ప్పేసిన ఖాకీ క‌ల‌ర్‌ షార్ట్ ష‌ర్ట్‌ లో క‌నిపించి సెగ‌లు పుట్టించింది. అంత‌కంత‌కు పైపైకి తేలిపోతున్న కుర‌చ‌ చొక్కా మాటున‌ పిక్క‌ల అందాల్ని అంతే ఇదిగా ఆవిష్క‌రించింది. ఇంకా చెప్పాలంటే యాసిడ్ మంట‌లు గుండెల్లో ఒంపింది. పెట్రోల్ చిమ్మి అగ్గి రాజేసింది. ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్ అన్న చందంగా.. ప్ర‌స్తుతం ఈ ఫోటోల‌న్నీ యువ‌త‌రం వాట్సాప్‌ లు - సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిపోతున్నాయి.