Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పాయల్ అహానా పోజంట

By:  Tupaki Desk   |   23 April 2020 4:30 AM GMT
ఫోటో స్టోరీ: పాయల్ అహానా పోజంట
X
'RX100' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే భారీ గుర్తింపు సాధించింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి. పోయినేడాది 'వెంకీమామ' సినిమా తో మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంది. అయితే ఎప్పుడూ షూటింగులతో రిబ్బను కటింగులతో యమా బిజీగా ఉండే పాయల్ ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమా అని ఇంటికే పరిమితమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఇంటిపనులు చేస్తూ ఆ ఫోటోలను తన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ నెటిజన్లతో నిత్యం టచ్ లో ఉంటోంది.

అలా అని హాటు ఫోటోలను పోస్ట్ చెయ్యడం మర్చిపోయిందనుకుంటే పొరపాటే. సాధారణంగా అయితే ఫోటో షూట్లు.. సూపర్ లొకేషన్లు.. అదిరిపోయే ఫ్యాషనబుల్ డ్రెస్సులతో హాట్ ఫోటోలు తీసుకునేది. ఇప్పుడు అదంతా మారిపోయింది. అందుకే మొన్నేమో 'పిల్లో ఛాలెంజ్' అంటూ ఎల్లో పిల్లోను ఒంటికి డ్రెస్ గా ధరించి అందాలు ఆరబోసింది. తాజాగా ఈ భామ ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో పాయల్ ఒక పేపర్ డ్రెస్సును ధరించింది. ఈ ఫోటోకు "నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? ప్రతి డ్రెస్ విభిన్నంగా ఉంటుంది #madewithstyle." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

నిజానికి ఈ పేపర్ డ్రెస్ తెలుగు వారికి కొత్తేమీ కాదు. కరోనాలు.. సామాజిక మాధ్యమాలు.. అంతర్జాలాలు.. పుట్టక మునుపే జంధ్యాలగారి సినిమాలో కామెడి సూపర్ స్టార్ రాజేంద్ర ప్రసాద్ ధరించి అందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. నిజానికి రాజేంద్ర ప్రసాద్ ధరించిన ఆ పేపర్ డ్రెస్ ను చూడని తెలుగువారు దాదాపుగా ఉండరు. ఇక కొన్ని నెలల క్రితం అదా శర్మ కూడా పేపర్ డ్రెస్ ధరించి జనాలను అవాక్కయ్యేలా చేసింది. పాయల్ డ్రెస్ కు రాజేంద్ర ప్రసాద్ డ్రెస్ గురించి తెలియని వారి నుంచి పొగడ్తలు దక్కాయి కానీ తెలుగు వారు మాత్రం 'ఓస్..ఇది మేమే కనిపెట్టాం' అంటున్నారు. అంటే ఈ డ్రెస్ పేటెంట్ మనదే!