Begin typing your search above and press return to search.

ఆర్ఎక్స్‌ 100 బ్యూటీకి అదిరే ఛాన్సు సొంతమైందిగా

By:  Tupaki Desk   |   9 Aug 2021 3:30 AM GMT
ఆర్ఎక్స్‌ 100 బ్యూటీకి అదిరే ఛాన్సు సొంతమైందిగా
X
నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసి.. హీరోయిన్ గా నిలదొక్కుకోవటం.. గ్లామర్ రసాన్ని చిందించి ఛాన్సులు సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ మేజిక్ ను చేసిన నటీమణిగా ఆర్ఎక్స్‌ 100 బ్యూటీ పాయల్ ను చెప్పాలి. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. తన అందంతో యూత్ కు పిచ్చెక్కిపోయేలా చేయటమే కాదు.. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

తనకొచ్చిన ఇమేజ్ ను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ.. చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఆమెకు అదిరే ఛాన్సు ఒకటి వచ్చేసింది. ఇప్పటికే తెలుగు.. తమిళ చిత్రాల్లో చేస్తున్న పాయల్ కు తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమను నుంచి పిలుపు వచ్చింది. ఎంట్రీలోనే పాన్ ఇండియా ఫిలింలో అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు మాంచి హ్యాపీ మూడ్ లో ఉంటారని చెబుతున్నారు.

పాయల్ ఓకే చెప్పిన కన్నడ మూవీకి శూన్య డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 1960-80 మధ్య కాలంలో సాగే ఒక డాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉండనుంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు నుంచే మొదలు కానుంది. ఈ సినిమాను కన్నడతో పాటు.. తెలుగు.. తమిళం.. మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కన్నడలో పాయల్ కు లభించిన తొలి అవకాశమే పాన్ ఇండియాది కావటం.. ఈ సినిమాతో కన్నడ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారని ఆశిద్దాం.